Chat Gpt అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు ఏం చేయాలన్నా Chat Gpt  లోనే  అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతోంది. "కూలీ" సినిమా చూడాలా? "వార్ 2" చూడాలా? అంటూ Chat Gpt లో పలువురు అభిమానులు అడుగుతుండగా, Chat Gpt మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇస్తోంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనకు తెలిసిందే, బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ మొదలైంది. రజనీకాంత్ నటించిన "కూలీ" థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన "వార్ 2" కూడా రిలీజ్ అయింది. రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ, కొన్నిచోట్ల నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. మొత్తానికి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హడావిడి చేస్తున్నాయి.


చాలామంది రేపు, ఎల్లుండి, ఆ తర్వాత రోజు సెలవులు కావడంతో ఏ సినిమా చూడాలి? అని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన మూవీ ఏది? "కూలీ"నా? లేక "వార్ 2"నా? అనుకుంటున్నారు. కొంతమంది కుర్రాళ్లు అయితే నేరుగా Chat Gpt అడుగుతున్నారు. "కూలీ" చూస్తే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వస్తుందా? లేక "వార్ 2"నా? అంటూ రకరకాల ఫన్నీ ప్రశ్నలు వేస్తూ ఆటపట్టిస్తున్నారు. అయితే Chat Gpt కూడా తెలివిగా సమాధానం ఇస్తోంది. “మీకు మాస్ యాక్షన్ ప్లస్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాకు వెళ్ళండి. ఆయన స్టైల్, పంచ్ డైలాగ్స్, ఫ్యాన్స్ హంగామా—All in one గా ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయి ఉంటుంది.



ఒకవేళ యాక్షన్ థ్రిల్లర్ ప్లస్ హై యూనివర్శల్ స్టాండర్డ్ కావాలనుకుంటే ‘వార్ 2’కి వెళ్ళండి. హృతిక్ రోషన్–జూనియర్ ఎన్టీఆర్‌ల పర్ఫార్మెన్స్ హైలెట్ అవుతుంది. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, టెన్షన్ ఫుల్ స్టోరీ కోసం ఈ మూవీని చూడవచ్చు” అని సమాధానం ఇస్తోంది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: