
ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కాదు సారా అలీ ఖాన్. బాలీవుడ్లో అత్యంత ఫిట్గా గ్లామరస్ గా ఉన్న హీరోయిన్గా పేరు సంపాదించింది. తన 29వ పుట్టినరోజు జరుపుకున్న సారా అలీ ఖాన్ చిన్నప్పటి నుంచి తనకు నటన మీద చాలా మక్కువ ఉండేది.కానీ టీనేజ్లో తనకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే సమస్య తో ఇబ్బంది పడుతూ అధిక బరువు పెరిగిపోయింది. దీనివల్ల హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, వేగంగా బరువు పెరగడం, జీర్ణక్రియ మందగించడం వంటివి జరుగుతూ ఉండేవట.
అయినప్పటికీ కూడా తనకు నటన మీద ఇష్టం ఉండడంతో ధైర్యంగా అన్ని సమస్యలను ఎదుర్కొని 45 కిలోల బరువు బరువుకు తగ్గాలని ఒక దృడ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ముఖ్యంగా కార్డియో, యోగ వ్యాయామం వంటి చేయడానికి ప్రత్యేకించి కొందరిని నియమించుకుందట. బరువు తగ్గడానికి తరచూ ఎక్కువగా డాన్స్ చేసేదాన్ని అని ,జంక్ ఫుడ్, చక్కెరకు చాలా దూరంగా ఉండే దాన్ని అంటూ తెలిపింది. ఎక్కువగా తాను నీరు, పండ్లు ,కాయగూరలను తీసుకునే దాన్ని అని తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురే ఈ సారా అలీ ఖాన్.