తెలుగు సినీ పరిశ్రమ లో టాప్ డైరెక్టర్ల లో ఒకరి గా కెరియర్ను కొనసాగిస్తు న్న వారి లో అనిల్ రావిపూడి ఒకరు . ఈయన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఆఖరుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈయన ఇప్పటివరకు దర్శకత్వం వహించి న ప్రతి సినిమా తో కూడా మంచి విజయాన్ని అందుకొని తెలుగు సినీ పరిశ్రమ లో దర్శకుడిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్గా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు.

మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 157 సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ ని మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు అనే విషయం మనకు తెలిసిందే. అనిల్ రావిపూడి మెగా 157 సినిమాకు సంబంధించిన షూటింగ్లో శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ ను కూడా ఆయన కంప్లీట్ చేశాడు.

దానితో ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈయన ఈ సినిమా టైటిల్ తో పాటు ఓ టీజర్ను కూడా కచ్చితంగా విడుదల చేస్తాడు అని మెగా అభిమానులు గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మెగా 157 సంబంధించిన కేవలం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాత్రమే విడుదల చేసే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దానితో మెగా ఫాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: