ఏంటి సావిత్రికి మరో వ్యక్తితో అక్రమ సంబంధమా..ఈ మాటని వేరే ఎవరైనా అంటే నిజంగా సావిత్రి ఫ్యాన్స్ వాళ్ళని కుక్కను కొట్టినట్లు కొడతారు. కానీ ఈ మాటని స్వయంగా జెమినీ గణేషన్ కూతురే అనడంతో చాలామంది నోరెళ్ళబెడుతున్నారు. మరి ఇంతకీ జెమినీ గణేషన్ కూతురు సావిత్రి పై అలాంటి మాటలు ఎందుకు మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహానటి బయోపిక్ ద్వారా సావిత్రి అంటే తెలియని ఎంతోమందికి తెలిసి వచ్చింది. అప్పటివరకు సావిత్రి అంటే ఎవరో తెలిసేది కాదు.కానీ మహానటి మూవీ ద్వారా ఆమె ఎంతటి మంచి మనసు గలదో అందరికీ తెలిసి వచ్చింది. అయితే ఈ సినిమాలో జెమినీ గణేషన్ ని తప్పుగా చూపించినందుకు ఆయన కూతుర్లు మండిపడ్డారు. మా నాన్న అలాంటి వాడు కాదు. 

మా నాన్న ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు అంటూ సావిత్రి కూతుర్ని కూడా ఈ కథ ఎలా తీస్తారు అని గొడవ పెట్టి దూరం పెట్టారట. ఇదంతా పక్కన పెడితే.. రీసెంట్గా జెమిని గణేషన్ కూతురు కమలా సెల్వరాజ్ మాట్లాడుతూ.. మా నాన్న చాలా మంచివాడు. అంతే కాదు మా నాన్నతో సినిమాలు చేసిన ప్రతి ఒక్క హీరోయిన్ ఆయన్ని ప్రేమించింది. కానీ ఆయన అందర్నీ పెళ్లి చేసుకోలేదు కదా..మా నాన్న ఎంతమందిని ప్రేమించినా కూడా చివరికి మా అమ్మ దగ్గరికి వచ్చేవారు. మా అమ్మ అంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టం. సావిత్రి ఇల్లు విడిచి అర్ధరాత్రి వర్షంలో వచ్చిన సమయంలో ఆమె చెడిపోకూడదనే ఉద్దేశంతో మా నాన్న ఆమె మెడలో తాళి కట్టాడు.

కానీ సావిత్రి మాత్రం బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని 15 సంవత్సరాలు ఇంట్లోకి రానివ్వలేదు. నాన్న ఎంతమందితో తిరిగినా కూడా చివరికి ఒక పిల్లవాడు బయట రోడ్డు మీద ఆడుకుని మళ్ళీ తల్లి చెంతకు ఎలా అయితే వస్తాడో మా నాన్న కూడా అలాగే బయట ఎంత మందితో తిరిగినా చివరికి అమ్మ దగ్గరికి వచ్చేవాడు అమ్మంటే అంత పిచ్చి ప్రేమ.. సావిత్రి మా లైఫ్ లోకి వచ్చి మా జీవితం మొత్తాన్ని నాశనం చేసింది. ఆమె బయోపిక్ గా తెరకెక్కిన మహానటి మూవీలో మా నాన్న గురించి చెడుగా చూపించారు. ఈ సినిమా వచ్చాక చాలా చోట్ల మా నాన్నని హంతకుడు అంటూ పోస్టర్లు వేశారు. కానీ సావిత్రి చేసిన పాపాలకే అలా దేవుడు శిక్షించాడు. ఆమె ఎన్నో పాపాలు చేసింది.

అలాగే ఆమె మద్యపానానికి బానిసై తాగి తాగి చనిపోతే మా నాన్న మీదికి తోసేశారు. మా నాన్న మోసం చేయడం వల్లే ఆమె మద్యానికి బానిసయిందని చూపించారు. కానీ అందులో చూపించింది పూర్తిగా ఫేక్. మా నాన్న పిల్లల్ని ఎంతో బాగా పెంచారు. ఆయన ఒక మంచి తండ్రి. మమ్మల్ని మాత్రమే కాదు సావిత్రి పిల్లల్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ అలాంటి ఆయన్ని మహానటి సినిమాలో పూర్తిగా వ్యతిరేకంగా చూపించారు. అలాగే సావిత్రి కి నాన్నతో పెళ్లి అయ్యాక కూడా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అంటూ సంచలన కామెంట్లు చేసింది కమలా సెల్వరాజ్.మరి ఈమె మాటలపై సావిత్రి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: