‘వార్ 2’ సినిమా విడుదలకు ముందు నుంచే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇది ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా. అంతకుముందు తెలుగు స్టార్ హీరోలందరూ తమ మొదటి బాలీవుడ్ ప్రయాణంలో హీరో పాత్రల్లోనే మెప్పించారు. దాంతో “ఎన్టీఆర్ కూడా అలానే చేస్తారని” అభిమానులు భావించారు. కానీ అంచనాలకు విరుద్ధంగా ఆయన ప్రతినాయక పాత్రలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తెలుగు స్టార్ హీరోల హిందీ ఎంట్రీలపై ఒకసారి దృష్టి వేసుకుంటే ఎన్టీఆర్, ఏయన్నార్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి వారు హిందీ తెరపై తొలిసారిగా కనిపించినప్పుడు పాజిటివ్ రోల్స్‌లోనే ఆకట్టుకున్నారు.


ముఖ్యంగా హీరోయిన్స్‌తో పాటలు పాడి, డ్యూయెట్స్ చేస్తూ, సాధారణ హీరోలాగే ప్రేక్షకులను అలరించారు. వీరికి పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా హిందీ తెరపై దర్శనమివ్వడం ప్రత్యేకతగా నిలిచింది. ‘దేవర’ విజయోత్సాహంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టిస్తుందని ఆశ‌లు పెట్టుకున్నారు. తెలుగునాట ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి ప్రధాన కారణం హీరోయిన్ లేకపోవడమేనని అభిమానులు వాదిస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి స్పీడ్ డాన్సర్, ఎమోషనల్ యాక్టర్‌కు ఒక హీరోయిన్ జోడీగా ఉంటే, సినిమా మరింత ఎట్రాక్ష‌న్‌గా ఉండేదని వారి అభిప్రాయం.


కథ విషయానికొస్తే, ఎన్టీఆర్ నటనపై ఎటువంటి సందేహం లేదు. ఆయన పోషించిన నెగటివ్ పాత్రకు గట్టి ఇంపాక్ట్ ఉందని సినీ విమర్శకులూ ఒప్పుకున్నారు. కానీ టాలీవుడ్ ప్రేక్షకుల మైండ్‌సెట్ విషయానికొస్తే, తమ హీరోను మొదటి హిందీ చిత్రంలో విలన్‌గా చూడడం కొంతమందికి న‌చ్చ‌లేద‌ని.. అందుకే ఫలితం మిక్స్‌డ్‌గా వ‌చ్చింద‌ని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా ఒక ఆసక్తికర అంశం ఏమిటంటే, హృతిక్ రోషన్ అభిమానులు కూడా ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయాన్ని సమర్థించారు. “ఎన్టీఆర్ లాంటి డాన్సర్‌కు ఒక హీరోయిన్ ఉంటే సినిమాకు మరింత కలర్ వచ్చేది. సినిమా రిజ‌ల్ట్ కూడా వేరేగా ఉండేవి” అని వారు అంగీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: