పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - అనుష్క జంటకి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే అదొక మ్యాజిక్‌. “బిల్లా”, “మిర్చి”, “బాహుబలి 1, 2 ” వంటి సినిమాల ద్వారా వీరి కాంబినేషన్ ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే చివరిసారిగా ఈ ఇద్దరూ కలిసి కనిపించిన సినిమా “బాహుబలి 2”. ఆ తర్వాత నుండి మళ్లీ వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం రాలేదు. సినిమాల్లోనే కాకుండా బయట ఈవెంట్లలో కూడా వీరి కలయిక దాదాపుగా జరగలేదు. దీంతో ఫ్యాన్స్ ఎంతో కాలంగా “ప్రభాస్ - అనుష్క మళ్లీ ఎప్పుడు కలుస్తారు?” అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం దాదాపు 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ జంట మళ్లీ క‌లిసి కనిపించ‌బోతున్నారు.


అయితే అది వెండి తెర మీద కాదు.. వీరుద్ద‌రు క‌లిసి ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది. ఇది కొత్త సినిమా కోసం కాదని, “బాహుబలి ది ఎపిక్” ప్రమోషన్ల కోసం అని తెలుస్తోంది. రాజమౌళి రూపొందించిన ఈ పాన్ ఇండియా మాస్టర్‌పీస్ రీ రిలీజ్ కానుండటంతో, ప్రమోషన్ ఈవెంట్లలో ప్రభాస్ - అనుష్క ఇద్దరూ పాల్గొనే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ఫ్యాన్స్‌లో ఇప్పటికే భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది. చాలాకాలంగా మిస్ అవుతున్న వారి ఫేవరేట్ జంటను మళ్లీ కలిసి చూడబోతున్నారనే ఆలోచన అనుష్క‌, ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ట్రీట్ లాంటిది. నిజంగా ఈ కలయిక జరిగితే, అది కేవలం ప్రమోషన్లకే పరిమితమైనా, అభిమానులకు గోల్డెన్ మూమెంట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.


ఇక ఈ రీయూనియన్ ఎప్పుడు జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో అధికారిక సమాచారం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా, ప్రభాస్ - అనుష్క మళ్లీ ఒకే వేదికపై కనిపించే రోజు దగ్గర్లోనే ఉండబోతోందన్న ఊహాగానాలు అభిమానుల హృదయాల్లో సంతోషం నింపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: