మనందరికీ తెలిసిందే.. ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఊహించని విధంగా చిక్కుల్లో ఇరుక్కుపోయింది. అసలు పొలిటికల్ పరంగా ఈ సినిమాకి ఎలాంటి స్కోప్ లేకపోయినా, కొంతమంది పొలిటిషియన్లు మాత్రం వార్ 2 సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుకున్నట్లుగానే తెలుగులో ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌గా తొక్కేశారు. బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా, తెలుగు ఇండస్ట్రీలో మాత్రం దారుణమైన డిజాస్టర్ అయింది. అంతేకాదు, సినిమా రిలీజ్ అయిన మూడురోజుల తర్వాత ఒక టిడిపి ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులు తిడుతూ ఉన్న ఆడియో సంచలనంగా మారింది. మొదటి నుంచే టిడిపికి, జూనియర్ ఎన్టీఆర్‌కీ కలిసిరావడం లేదనే కామెంట్స్ భారీ స్థాయిలో వినిపించాయి..ఇప్పుడు అది ఇంకా ఎక్కువుగా మారిపోయింది.


అయితే సోషల్ మీడియాలో ఒకపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో మండిపడుతుంటే.. మరొకపక్క కొందరు జూనియర్ ఎన్టీఆర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తూ బూతులు తిడుతున్నారు. అయినా కూడా ఎన్టీఆర్ ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం ఏంటి? ఆయన ఈ పొలిటిషియన్లతో మాకు అనవసరం అనుకుని సైలెంట్‌గా ఉంటున్నారా? లేక మాటలతో కాదు, చేతలతోనే చూపించాలి – మనం ఏంటో చూపిద్దాం అని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లాన్స్ చేస్తున్నారా?



కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయబోతున్నాడని అంటున్నారు. అయితే దానికి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ కానీ, అధికారిక ప్రకటన కానీ ఇప్పటివరకు రాలేదు. మరి నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారా? లేక అసలు రాజకీయాలంటే ఆయనకి ఇష్టం లేదా? ఇంత రేంజ్‌లో టార్గెట్ అవుతున్నా, ఆయన పొలిటికల్ పార్టీ పెడితే ఇప్పటి స్పీడ్‌కి జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోగలడా? కేవలం ఫ్యాన్స్‌పై నమ్మకం పెట్టుకుని పొలిటికల్ పార్టీ పెడితే ఎంతవరకు సక్సెస్ అవుతారు? అసలు జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముంది..? అనేది తెలియాలంటే ఆయనే నోరు విప్పాలి. వార్2 కుట్రపై తారక్ మౌనంగా ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: