ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమందికి సక్సెస్, ఫ్లాప్ అనే లెక్కలతో పెద్దగా సంబంధం ఉండదు. ఎన్ని సినిమాలు పర్లేదు .. ఆ హీరోయిన్‌నే కావాలని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పట్టుబడతారు. అలా అదృష్టం ఎక్కువగా ఉన్న ఓ ముంబై భామ ఇప్పుడు టాలీవుడ్‌లో మళ్లీ చర్చనీయాంశం అవుతోంది. ఈ బ్యూటీ కెరీర్ బాలీవుడ్‌లో ప్రారంభమైంది. అక్కడ రెండు సినిమాల్లో నటించింది. కానీ రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ టైంలోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఏడాదికి ఓ సినిమా చొప్పున రెండు సినిమాలు చేసింది. ఇటీవలే ఒక సినిమా రిలీజ్ అయింది. కానీ అదీ ఫ్లాప్‌నే. అంటే బీ–టౌన్‌లో ఎదురైన పరిస్థితే ఇక్కడ కూడా రిపీట్ అయినట్టే.


అయినా అవకాశాలు మాత్రం తగ్గలేదు. చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి డబ్బింగ్ సినిమా. చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇంకో సినిమా మాత్రం స్ట్రెయిట్ తెలుగు మూవీ. ప్రస్తుతం ఆన్‌సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌పైనే ఇండస్ట్రీలో బలమైన పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కంటెంట్ బాగుందని, ఈ సారి ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం క్రియేట్ అయింది. ఈ బ్యూటీ కూడా ఇదే సినిమాతో మళ్లీ రేసులోకి వస్తానని గట్టి నమ్మకంతో ఉంది. అసలే వరుసగా ఫ్లాప్ అవ్వడంతో “ఐరన్ లెగ్” అనే ట్యాగ్ దగ్గరపడింది. ఈ ఒకే హిట్ దానిని బద్దలుకొడుతుందని ఆశపడుతోంది. హీరోయిన్ మాత్రమే కాదు.. ఆ సినిమా హీరో కూడా వరుస వైఫల్యాలతో బాధపడుతున్నాడు. అతడికీ ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం. కాబట్టి ఇరువురి కెరీర్‌కీ ఈ ప్రాజెక్ట్ కీలకమైపోయింది.



అయితే విమర్శలు మాత్రం ఆగట్లేదు. స్క్రీన్ ప్రెజెన్స్ వీక్‌గా ఉందని, ఓ హీరోయిన్‌కి ఉండాల్సిన కేరక్టరైజేషన్ కనిపించడం లేదని అనాలిస్ట్‌లు అంటున్నారు. అయితే ఇందులో డైరెక్టర్ ట్రీట్మెంట్, కెమెరామెన్ యాంగిల్స్ కూడా ప్రభావం చూపుతున్నాయనే వాదన ఉంది. ఆ లోపాలను కరెక్ట్ చేస్తే ఈ బ్యూటీ బాగానే కనెక్ట్ అవుతుందని ట్రేడ్ టాక్. ఏదేమైనా… వరుస వైఫల్యాల తర్వాత కూడా అవకాశాలు కోల్పోకుండా ముందుకు సాగుతున్న ఈ ముంబై భామ, రాబోయే ప్రాజెక్ట్‌తో మాస్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తుందా ? లేక మళ్లీ అదే “ఫ్లాప్ ట్రాక్” కొనసాగిస్తుందా? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: