సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదైనా సంచలన వార్త బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రంగం ఎప్పుడూ గ్లామర్, సర్ప్రైజ్‌లు, అనూహ్యమైన డెవలప్మెంట్స్‌తో నిండిపోయి ఉంటుంది. ఈ మధ్య కాలంలో దర్శకులు హీరోలుగా మారడం, హీరోలు ప్రొడ్యూసర్లుగా మారడం, రైటర్లు డైరెక్టర్లుగా ఎదగడం వంటి ట్రెండ్స్ బాగా పాపులర్ అయ్యాయి. అదే తరహాలో ఇప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయారు. ‘కైతి’, ‘మాస్టర్’, ‘విక్రం’, ‘లియో’ వంటి వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా ఎదిగిన లోకేష్ కనగరాజ్ రీసెంట్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించినప్పటికీ, టాక్ మాత్రం మిక్స్‌గా వచ్చింది. చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా డైరెక్షన్‌పై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడా లోకేష్ కనగరాజ్ పేరును ట్రోల్ చేస్తూ పోస్టులు పెట్టిన వాళ్లు చాలామంది. కానీ ఈ నెగిటివ్ ట్రెండ్స్ అన్నీ పక్కన పెడితే, లోకేష్ కనగరాజ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో మరో పెద్ద వార్త హాట్ టాపిక్‌గా మారింది.

"కూలీ" సినిమాలో విలన్‌షేడ్‌లో కనబడి ప్రత్యేకమైన పాత్రతో ఆకట్టుకున్న గ్లామరస్ హీరోయిన్ రచితా రామ్ గుర్తుందా? కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే టాప్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి, తన నటనతో పాటు తన అందంతో కూడా అభిమానులను ఇంప్రెస్ చేశారు. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన వచ్చింది. ఆ ఒక్క పాత్రతోనే రచితా రామ్ పేరు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, లోకేష్ కనగరాజ్ తన ఫస్ట్ "హీరో" ప్రాజెక్ట్ కోసం రచితా రామ్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. అవును! ఈసారి దర్శకుడిగా కాదు, హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు లోకేష్. ఈ ప్రాజెక్ట్‌ను అరుణ్ మాధేశ్వరన్ డైరెక్ట్ చేయబోతున్నారట. అరుణ్ గతంలో ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా, కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ‘సాని కైడం’ సినిమాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో లోకేష్ హీరోగా నటించబోతుండటం ఇండస్ట్రీలో పెద్ద హైలైట్‌గా మారింది.

సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. అయితే ఇందులో పెద్ద చర్చనీయాంశంగా మారింది ఏమిటంటే..లోకేష్ కనగరాజ్ హీరోయిన్‌గా రచితా రామ్‌ను ఎందుకు ఎంచుకున్నారు? ఆమెను బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల కోసం ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఇండస్ట్రీలో ఎంతోమంది  స్టార్ హీరోయిన్స్ ఉన్నా రచితా రామ్ వైపు ఎందుకు మొగ్గుచూపారు? ఈ ప్రశ్నలన్నీ ప్రస్తుతం కోలీవుడ్, సాండల్‌వుడ్, టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అదే కాదు, సోషల్ మీడియాలో అయితే ఈ జంటపై పలు రకాల కామెంట్లు వస్తున్నాయి. "లోకేష్ కనగరాజ్ మరియు రచితా రామ్ మధ్య ఏదైనా స్పెషల్ బాండ్ ఉందా?", "ఎందుకింతగా ఆమెకే ప్రాజెక్టులు ఇస్తున్నారు?" అంటూ అభిమానులు, నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు. ఒకవైపు ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుండగా, మరోవైపు ఈ జంటపై కూడా కురియస్ పెరుగుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: