టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన 2006 వ సంవత్సరం విడుదల అయిన దేవదాసు మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ కి వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ఈయన చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన రీతిలో కెరియర్ను కొనసాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రామ్ కి వరుసగా ఆపజయాలు దక్కుతున్నాయి.

ఆఖరుగా ఈయన 2019 వ సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన నటించిన రెడ్ సినిమా కాస్త పర్వాలేదు అనే విజయాన్ని సొంతం చేసుకున్న ఆ తర్వాత ఈయన నటించిన ది వారియర్ , స్కంద , డబుల్ ఇస్మార్ట్ మూవీ లు మాత్రం భారీ అపజాయాలను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం రామ్ , మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తోంది.

వరుసగా మూడు అపజయాలను అందుకున్న రామ్ ప్రస్తుతం నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులు ఇప్పటికే అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకున్నట్లు , ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: