టాలీవుడ్ పవర్‌స్టార్, జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేడు. సినిమా తెరపై హీరోగా, రాజకీయ వేదికపై నాయకుడిగా ఆయన ప్రభావం అమోఘం.
 అభిమానులు ప‌వ‌న్ ను కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఇన్స్పిరేషన్‌గా భావిస్తారు. ఆయన సరళమైన జీవన శైలి, నిజాయితీ, సామాజిక సేవ పట్ల ఉన్న నిబద్ధత కారణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫాలోవర్స్ కూడా ఎక్కువే.
1996లో `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`తో పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి నుంచే తన స్వంత స్టైల్, యాక్షన్, న్యాచురల్ యాక్టింగ్ తో ప్రత్యేకంగా నిలిచారు. యూత్‌కి రియల్ ఐకాన్‌గా మారారు.
మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగానే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చినా.. త‌క్కువ స‌మ‌యంలో త‌న సొంత బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌డిగా గుర్తింపు పొందారు.
సినిమా రంగంలో విజయాన్ని అందుకున్న తర్వాత ప్రజల కోసం పని చేయాలన్న ఉద్దేశంతో ప‌వ‌న్ 2014లో జనసేన పార్టీని స్థాపించారు. మొదట్లో తక్కువ సీట్లు వచ్చినా, ఆయన పోరాట పంథా ప్రజల దృష్టిని ఆకర్షించింది.
 2019 ఎన్నికల్లో స‌త్తా చాట‌లేక‌పోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. 2024లో హిస్ట‌రీ క్రియేట్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, మిత్రపక్షాలతో కలిసి ఘన విజయం సాధించింది.
 పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఆయన పొలిటిక‌ల్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. సినిమాల్లో హిట్ అయినట్టే, ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన స్థిరంగా అడుగులు వేస్తున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో కల్ట్ ఫాలోయింగ్ కలిగిన అరుదైన హీరోలలో పవన్ ఒకరు. ఫ్లాప్ అయిన కూడా ఆయన సినిమా రిలీజ్ అంటే పండుగలా చేసుకుంటారు అభిమానులు.
 వ్యక్తిత్వం, సరళత, నిస్వార్థత కారణంగానే ప్రజలు ఆయనను పవర్ స్టార్ గా మాత్రమే కాకుండా ప్రజానాయకుడుగా కూడా గౌరవిస్తున్నారు. ఇక నేడు ప‌వ‌న్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ మ‌రియు ఫాలోవ‌ర్స్ ఆయ‌నకి సంబంధించి క‌చ్చితంగా చూడాల్సిన రేర్ పిక్స్ కొన్ని ఉన్నాయి. మ‌రి లేటెందుకు వాటిపై ఓ లుక్కేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: