నిజ జీవితంలో మాత్రమే కాకుండా, సినిమాల పరంగా కూడా హీరో-హీరోయిన్స్ మధ్య క్యారెక్టర్ రిలేషన్షిప్స్ ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ప్రెసెంట్‌లో అలాంటి ఒక రిలేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. మనందరికీ తెలిసిందే, సినిమాల్లో నటించిన పాత్రలు కొన్నిసార్లు ఆ పాత్రలో నటించే స్టార్స్ కోసం రాసినట్లు ఉంటాయి. హీరో-హీరోయిన్స్ ఆ రోల్స్ కి పర్ ఫెక్ట్ గా అనిస్తారు. ఆ లిస్ట్ లోకి హీరోయిన్ సింధూ తులాని కూడా వస్తారు. ఇండస్ట్రీలో సింధు తులానికి  ఒక ప్రత్యేకమైన పేరు ఉంది.
 

మొదట హీరోయిన్గా, తర్వాత హీరో,హీరోయిన్స్‌కి అక్క, వదిన క్యారెక్టర్‌లలో నటించిన ఆమె, ఎన్నో సినిమాల్లో కనిపించి తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. అయితే, ఎక్కువగా అందరికీ నచ్చేవి రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవి రెండు టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో ఉంటాయి. ఒక సినిమాలో ఆమె హీరోకి లవర్‌గా, మరొక సినిమాలో హీరోకి వదిన‌గా కనిపించింది. ఆ రెండు సినిమాలు పౌర్ణమి, సన్ ఆఫ్ సత్య మూర్తి. సింధు తులాని నటించిన ఈ రెండు సినిమాలు ఆమె ఫ్యాన్స్ ని బాగా  నచ్చుతాయి.



ప్రభాస్ కెరియర్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో వచ్చిన పౌర్ణమి సినిమా అందరికి గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో త్రిష, సింధు తులాని, చార్మి హీరోయిన్స్‌గా నటించారు. సింధు తులాని క్యారెక్టర్ చిన్నది అయినా చాలా చక్కగా ఉంటుంది. ప్రభాస్‌ని ఇష్టపడే మరదలు క్యారెక్టర్‌లో ఆమె బాగా నటించింది. అయితే, సింధు తులాని మరో సినిమాలో సన్నాఫ్ సత్యమూర్తి లో  హీరో అల్లు అర్జున్‌కు వదిన క్యారెక్టర్‌లో నటించింది. వెన్నెల కిషోర్ భార్యగా ఈ సినిమాలో ఆమె చాలా సైలెంట్ కానీ పవర్ఫుల్‌గా కనిపించింది. పాత్ర చిన్నదైనా, ఆమె పర్ఫార్మెన్స్ వేరే లెవెల్‌లో ఉంది.



ఆ టైంలో జనాలు సోషల్ మీడియాలో "ఒక హీరోకు లవర్, మరొక హీరోకు వదినగా ..వాట్ ఏ టాలెంట్" అని బాగా హైలెట్ చేశారు. అంతేకాదు, ప్రభాస్ లవర్ నే  ఈ బన్నీ వదిన అంటూ ఫెవికాల్ కంటే స్ట్రాంగ్ గా ఉండే బంధం ఇది  అని నాటీగా కామెంట్స్ చేసేవారు.  పౌర్ణమి సినిమా పెద్ద హిట్ కాలేదు కానీ, సన్నాఫ్ సత్యమూర్తి బాగా ఆకట్టుకుంది. పౌర్ణమి సినిమా అభిమానులను వేరే రేంజ్‌లో టచ్ చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: