మనందరికీ తెలిసిందే.. తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్ హీరోలు వాళ్ళ పాత్రలను ఎంచుకోవడానికి చాలా జాగ్రత్తగా నిర్ణయించుకుంటారు. ముఖ్యంగా వారి ఇమేజ్‌కి విరుద్ధంగా ఉండే పాత్రలు, లోపాలు ఉన్న క్యారెక్టర్లు లేదా నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్స్‌ను చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు ముందుకు రారు. గుడ్డివాడిగా, కుంటివాడిగా, లేదా ఏదైనా ఫిజికల్ లోపం ఉన్న పాత్రలు చేయడానికి వెనుకాడటం సర్వసాధారణం. దీనికి ప్రధాన కారణం వారి స్టార్ ఇమేజ్‌ దెబ్బతినకూడదని భావించడం, మరియు అభిమానుల అంచనాలను తగ్గించుకోవడం ఇష్టం లేకపోవడమే.


కానీ ఈ ధోరణికి చెక్ పెట్టిన హీరోల్లో ఒకరు రామ్ చరణ్. 2018లో విడుదలైన రంగస్థలం సినిమాలో ఆయన చెవిటివాడి పాత్రలో నటించడం నిజంగా ఒక సాహసమే. ఆ సినిమాలో ఆయన ప్రదర్శన చూసి అభిమానులు మాత్రమే కాదు, సినీ విమర్శకులు, ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ పాత్రలో చరణ్ నటనకు జాతీయ అవార్డు రావాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. రంగస్థలం సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అలాంటి రిస్క్ తీసుకుని ప్రయోగాత్మక పాత్ర చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక భారీ చిత్రంలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రెండు విభిన్నమైన షేడ్స్‌లోని క్యారెక్టర్లు ఉంటాయట. వాటిలో ఒక పాత్రలో ఆయన నత్తివాడిగా కనిపించబోతున్నారని సమాచారం. సినిమా సర్కిల్స్‌లో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్‌ ఇలా ఒక నత్తి వ్యక్తి పాత్రను పోషించడం ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయి అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.

 

ఈ వార్త బయటకి రాగానే, చాలా మంది రంగస్థలం సినిమా రామ్ చరణ్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది అనే విషయాని గుర్తు చేసుకుంటున్నారు. చరణ్ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించినట్టే, ఎన్టీఆర్ కూడా ఈ నత్తి వాడి పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాడని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు ఇమేజ్ పరిమితులను దాటి ఇలాంటి సవాళ్లను స్వీకరించడం చాలా అరుదు. కానీ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ ప్రతిభను నిరూపించుకునే దిశగా సాహసోపేతమైన పాత్రలు ఎంచుకోవడం అభిమానులకు గర్వకారణం. సినీ ప్రియులు, అభిమానులు వీరి కెరీర్ గ్రోత్‌ను “దేవుడు చేసిన మ్యాజిక్”గా అభివర్ణిస్తున్నారు. ఒకరికి రంగస్థలం సినిమా మైలు రాయిగా నిలిచినట్టే, ఎన్టీఆర్ రాబోయే ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవుతుందని, ఆయన కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్తుందని అందరూ నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: