
పలు ఇంటర్వ్యూలలో చాలా సార్లు వీరే స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించారు. “బిర్యానీ అంటే ప్రాణం. కనపడితే ఆగలేం, కచ్చితంగా కుమ్మేస్తాం” అంటూ వీరందరూ సరదాగా చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఒకో హీరోకి ఇష్టమైన బిర్యానీ రకాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి:
ప్రభాస్‌కి గోంగూర రొయ్యల పులావ్ అంటే ప్రాణం. ఆయనకు ఫుడ్ అంటే అంత ఇష్టం ఉండడంతో, ఒకసారి రాజమౌళి “బాహుబలి” సినిమాకి డైట్ ఉండాలి అని చెప్పినప్పుడు కూడా సరదాగా "సినిమా అయినా ఆపేస్తా డైట్ చేయను" అంటూ చెప్పుకొచ్చారట.. ఇంతలా ఫుడ్ పిచ్చోడు రెబల్ హీరో ప్రభాస్. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కి మటన్ బిర్యానీ అంటే ప్రాణం. తినడమే కాదు, వండడంలో కూడా ఆయనకు అసాధారణ ప్రతిభ ఉంది. ఆయన వండే బిర్యానీ తిన్నవాళ్లు ఆయనను చెఫ్‌లా పొగుడుతుంటారు.
రామ్ చరణ్‌కి హైదరాబాది చికెన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఆయన భార్య ఉపాసన కూడా కెనడాలోని ఒంటారియో టూర్‌లో ఈ విషయాన్ని పబ్లిక్‌గా షేర్ చేసింది. వీరి ముగ్గురి మధ్య ఉన్న ఈ బిర్యానీ లవ్ ఫ్యాన్స్‌కు పెద్ద ఎంటర్టైన్‌మెంట్ టాపిక్ అయింది. . సోషల్ మీడియాలో “ప్రభాస్, చరణ్, తారక్ ఇలా ఫుడ్ పిచ్చోడ్లా ఉంటారా?” అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సినిమా రంగంలో సూపర్ స్టార్‌లు అయినా, వీరు తమ ఫుడ్ లవ్‌ను ఎప్పటికీ మార్చుకోలేదు. వీరి ఈ ఫుడ్ లవ్ వీరి వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ఒక ముచ్చటైన కోణం అని చెప్పొచ్చు. ప్రజెంట్ ముగ్గురు కూడా వాళ్లు కమిట్ అయిన పాన్ ఇండియా సినిమా షూట్ లల్లో బిజీ బిజీ గా ఉన్నారు..!!