ప్రస్తుత కాలంలో జానపద పాటలు ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ జానపదాలకు కోట్లాది మంది నుండి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా జానపదాలు అంటే కరీంనగర్ జిల్లాకు పెట్టింది పేరు. ఈ జిల్లా నుంచి ఎంతోమంది సింగర్ లు ఉన్నారు. అలాంటి ఈ తరుణం లో ఈ మధ్య జానపద పాటలు అనగానే సింగర్ మామిడి మౌనిక పాడిన పాటలే ఎక్కువగా పేరు తెచ్చుకుంటున్నాయి. అయితే ఆమె ఇప్పటికే ఎన్నో పాటలు స్వయంగా రాసి మరీ పాడింది. అలాంటి ఆ పాటల్లో తాజాగా రిలీజ్ అయిన మరో పాట సోషల్ మీడియా లో హైలైట్ అవుతోంది.  

ఇంతకీ ఆ పాట ఏంటయ్యా అంటే  " జామ చెట్టు కింద జారిపడ్డావోయ్ బావయ్య.. కాలు జారిపడ్డావోయ్ బావయ్య " అంటూ సాగే ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పల్లెటూర్ల లో బావ మరదళ్ల మధ్య సాగే  సంఘటనల ఆధారంగా ఈ పాటను రాశారు. ఇందులో బావ ను మరదలు ఆట పట్టించడాన్ని ప్రధానంగా తీసుకొని ఈ పాటను తీసుకొచ్చారు. గ్రామీణ తెలంగాణ ఆత్మను తాకే స్వరాలలోకంలోకి తీసుకెళ్తూ ఈ పాట సాగుతుంది. 

ముఖ్యంగా జానపద సాంప్రదాయం,భావోద్వేగం, సంస్కృత మూలాలను ప్రతిబింబిస్తుంది. ఈ పాటకు మామిడి మౌనిక స్వరం అందించగా ఇందులో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ భ్రమరాంబిక తుటిక నటించింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో హల్ చల్ అవుతుంది. ఇక ఈ పాట కూడా ఎన్ని కోట్ల వ్యూస్ సాధిస్తుందో  ముందు ముందు తెలుస్తోంది. ఇక మామిడి మౌనిక పాడిన పాటల్లో ప్రముఖంగా 'దారిపొంటత్తుండు', 'ఉంగూరమే ముద్దుటుంగూరమే', 'బావా జల్దిరావా' 'కోరుకున్నారోరయ్య', 'నెమలీయ రాజా', 'మదనాసుందారి', వంటి పాటలు ఫేమస్ అయ్యాయి.ఇంతకుముందు ఆమె పాడినటువంటి  దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తాండు  అనే పాట ఏ విధంగా యూట్యూబ్ ని షేక్ చేసిందో ఆ విధంగానే  ఈ పాట కూడా వైరల్ అవ్వాలని మనం కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: