సినిమా ఇండస్ట్రీలో మహిళా నటీమణులను వేధించడం అనేది చాలా కామన్.. ఎంతోమంది మహిళా నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు. అయితే వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఉంది. అయితే అది క్యాస్టింగ్ కౌచ్ అయితే కాదు. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఒక విషయంలో తెగ టార్చర్ చేశారట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే బాలకృష్ణ సినీ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఆదిత్య 369 మూవీ హీరోయిన్ మోహిని అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా తర్వాత మోహిని ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తమిళ సినిమాల్లో కూడా మోహిని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.అయితే అలాంటి మోహిని తమిళ మూవీ కన్మణి చేసే సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురైందట. 

ఆర్కే సెల్వమణి దర్శకత్వం వహించిన కన్మణి మూవీలో ఉడాల్ తలువా అనే పాట కోసం ఇష్టం లేకుండానే బలవంతంగా ఓ సీన్ చేసిందట. ఉడాల్ తలువా పాట కోసం డైరెక్టర్ బలవంతంగా మోహినీతో స్విమ్  సూట్ వేయించారట. అయితే ఈ పాట కోసం స్విమ్మింగ్ ఫూల్ లో దిగి స్విమ్  చేయాలట. కానీ తనకి స్విమ్మింగ్ రాదని చెప్పినా కూడా డైరెక్టర్ వినకుండా స్విమ్మింగ్ నేర్చుకోమని చెప్పారట.ఇక అప్పట్లో స్విమ్మింగ్ నేర్పించేవాళ్లు ఆడవారు లేకపోవడంతో మగవాళ్ళ ముందే సగం బట్టలు వేసుకొని స్విమ్మింగ్ నేర్చుకుందట. కానీ అలా వేసుకోవడం చాలా ఇబ్బంది అనిపించిందట. అయితే అలా స్విమ్ సూట్ వేసుకొని చేయడం నావల్ల కాదు నన్ను వదిలేయండి అని ఏడ్చినా కూడా డైరెక్టర్ వినలేదట.

 ఎలాగొలా బలవంతంగా ఆ సీన్ పూర్తిచేసి హమ్మయ్యా నా పని అయిపోయింది అనుకునే లోపే మళ్ళీ ఊటీలో అలాంటి సీన్ చేయమని డైరెక్టర్ చెప్పారట. దాంతో కోపంతో మోహిని ఇప్పటికే బలవంతంగా ఆ సీన్ చేశాను. మళ్లీ ఈ సీన్ అంటే నా వల్ల కాదు..నాకు ముందే ఈ సీన్ చేయాలని మీరు చెప్పలేదు అంటూ డైరెక్టర్ తో గొడవ పెట్టుకుందట. అలా ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా కన్మణి మూవీ కోసం స్విమ్ సూట్ వేయాల్సి వచ్చింది..గ్లామరస్ గా చేయాల్సి వచ్చింది అంటూ మోహిని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే సూర్య సన్నాఫ్ కృష్ణన్,చిన్న తంబి, ముత్తు వంటి సినిమాల్లో హీరోయిన్ గా నేనే చేయాల్సిందని, కానీ మిస్ అయ్యానంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: