యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ స‌జ్జా స‌క్సెస్‌పై టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్స్ అసూయ ప‌డుతున్నారా? అత‌ని ఎదుగ‌ల చూసి ఓర్వలేక‌పోతున్నారా? అంటే సోష‌ల్ మీడియా నుంచి అవున‌న్న స‌మాధాన‌మే వినిపిస్తోంది. తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమా తాజాగా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతూ వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. క్లాస్ ఆడియెన్స్ నుంచి మాస్ ఆడియెన్స్ వరకూ కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతోంది. ముఖ్యంగా సనాతన ధర్మం నేపథ్యంలో కథనాన్ని చెప్పిన విధానం, కొత్త విజువల్ ప్రెజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది.


అటువంటి మూవీపై టాలీవుడ్ స్టార్స్ మౌనం పాటించ‌డం ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు దారితీసింది. సాధారణంగా ఇతర భాషల సినిమాలు హిట్ అవుతుంటే తెలుగు స్టార్ హీరోలు మొదటగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతారు. మహేష్ బాబు, నాగ చైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారు హిందీ, తమిళ్, మలయాళం సినిమాలకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతూ ప్రశంసలు కురిపించిన సందర్భాలు అనేకం. కానీ ఈసారి ‘మిరాయ్’ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. ఇప్పటివరకు ఒక్క పెద్ద హీరో అయినా ఈ సినిమాను సపోర్ట్ చేస్తూ పబ్లిక్‌గా రియాక్ట్ కాలేదు.


దీంతో ఇతర భాషా సినిమాలకు సపోర్ట్ చేసే మనోళ్లు, మన తెలుగు సినిమా సక్సెస్ అయితే ఎందుకు మౌనం వ‌హిస్తున్నారు? తేజ ఎదుగుదలను అంగీకరించలేకపోతున్నారా? అన్న ప్ర‌శ్న‌ల‌ను నెటిజ‌న్లు తెర‌పైకి తెస్తున్నారు. తేజ సజ్జా వరుసగా పాన్ ఇండియా సక్సెస్ ఫార్ములాతో ముందుకు వెళ్తున్నాడు. గతంలో వచ్చిన `హనుమాన్` బ్లాక్‌బస్టర్ తర్వాత ఇప్పుడు మిరాయ్ కూడా విజయవంతం కావడం అతడిని కొత్త జోన్‌లోకి తీసుకెళ్లింది. ఇది సహజంగానే టాప్ హీరోల ఫ్యాన్ బేస్, వారి ఇమేజ్‌ను టచ్ చేస్తుంది. వారి బాక్సాఫీస్ మార్కెట్‌కు కూడా డైరెక్ట్ ఛాలెంజ్ అవుతుంది. అంతుకే తేజ స‌క్సెస్‌ను ప‌బ్లిక్‌గా టాలీవుడ్ హీరోలు గుర్తించ‌డం లేదని మాట్లాడుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: