ఏంటి సమంత కి రష్మిక వెన్నుపోటా.. వీళ్ళిద్దరూ హీరోయిన్స్..వెన్నుపోటు పొడుచుకోవాల్సిన అవసరం ఏముంది.. అయినా సమంతకి వెన్నుపోటు పొడిచేలా రష్మిక ఏం చేసింది అని మీ అందరికీ ఓ డౌట్ ఉంటుంది. అయితే రష్మిక సమంతకు వెన్నుపోటు పొడిచింది అనే వార్త రావడానికి కారణం సమంత ఒప్పుకున్న సినిమాలో రష్మిక ఎంట్రీ ఇచ్చిందట. మరి ఆ సినిమా ఏంటి.. ఎందుకు సమంతను తీసేసి రష్మిక ఎంట్రీ ఇచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సమంత రష్మిక ఇద్దరూ హీరోయిన్లు గానే కాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు.అలా సమంత శాకుంతలం, యశోద, ఓ బేబీ వంటి సినిమాలు చేసింది. 

అలాగే రష్మిక కూడా ఈ మధ్యకాలంలో ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో, మైసా వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఓకే చెప్పింది. అయితే రష్మిక చేసే మైసా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల కంటే ముందే రెయిన్ బో అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని అనౌన్స్ చేసింది.అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయినప్పటికీ ఎందుకో ఈ సినిమాకి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రావడం లేదు.బడ్జెట్ కారణంగానో లేక సినిమా విషయంలో ఎవరి మధ్యనైనా విభేదాలు వచ్చాయో తెలియదు కానీ రెయిన్ బో మూవీ అటకెక్కింది. అయితే రెయిన్ బో మూవీ మొదట చేయాల్సింది సమంతనేనట .

హీరోయిన్ ని ఇందులో ఫిక్స్ చేశాక సడన్ గా అందులో నుండి సమంత తప్పకుందట. అయితే సమంత చేయబోయే రెయిన్ బో మూవీని ప్రొడ్యూసర్లు అఫీషియల్ గా ప్రకటించాక అందులో నుండి సమంత సడన్గా తప్పుకోవడంతో సమంత ని పక్కన పెట్టేసి రష్మికను ఇందులో తీసుకున్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోలో అమల చేతుల మీదుగా రెయిన్ బో మూవీ గ్రాండ్ గా ఓపెనింగ్ అయింది.. ఈ సినిమాలో రష్మిక తో శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ కూడా ఉన్నట్టు ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు. ఈ సినిమా తర్వాత అనౌన్స్ చేసిన మైసా, ది గర్ల్ ఫ్రెండ్ రెండు సినిమాల నుండి అప్డేట్స్ వచ్చినప్పటికీ రెయిన్ బో మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: