
సినిమాను చూసిన ప్రముఖ నటులు, సుప్రసిద్ధులు కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్, రవితేజ, నాగచైతన్య, నాని, విజయ్ దేవరకొండ, అడవి శేష్‌లతో పాటు తాజాగా మహేష్ బాబు కూడా సినిమాలోని ప్రత్యేకతలను ప్రశంసించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ ఎర్రమళ్లి ట్వీట్టర్ వేదికగా.. ‘‘మా సినిమా మీద మీరు రివ్యూ ఇవ్వండి మహేశ్ అన్న ’’ అంటూ షాకింగ్ పోస్టు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. "సినిమాకి మహేశ్ అన్న రివ్యూ ఇస్తే చాలు..లేదంటే ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికైన వెళ్లిపోతా"అంటూ ట్వీట్ చేశాడు.. ఆ పోస్టుపై మహేష్ బాబు స్పందిస్తూ.. “లిటిల్ హార్ట్స్ చాలా సరదాగా, కొత్తగా, ఇన్‌స్టెన్స్‌గా ఉంది. నటీనటుల ఎన్నో ఎక్స్ట్రా శ్రమ పెట్టి సెన్సేషనల్‌గా నటించారు. మొత్తం సినిమా చాలా ఆనందదాయకంగా ఉంది” అని ఆయన రాసుకొచ్చారు.
సంజిత్ విషయంలో మాత్రం మహేష్ బాబుకు ప్రత్యేకమైన ఆనందం వ్యక్తం చేసి.. “ నువ్వు దయచేసి ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్లకు.. నువ్వు కొంత కాలం బిజీగా మారిపోతావు..రాకింగ్ చేస్తావు. మొత్తం టీమ్‌కు నా అభినందనలు” అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంజిత్ వెంటనే “నేను ఎక్కడికి పోను, మహేష్ అన్న!” అని రిప్లై ఇచ్చాడు. ఈ రెండు ట్వీట్లూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేశ్ ట్వీట్ చేయడం అంటే అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం . ఇదే కారణంగా మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరపడ్డారు. కొంత మంది ఫ్యాన్స్ మాత్రం సరదాగా "సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమా డైలాగ్ లతో “ఓరి దండం రా బాబు, దయచేసి ఫోన్ ఆపేయకు” అనే సరదా సెషన్లతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్స్ వైరల్ చేస్తున్నారు.