పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాకు పరిస్థితులు సైతం అనుకూలంగా ఉన్నాయి. 2025 బిగ్గెస్ట్ హిట్ గా ఓజీ నిలవడం సాధ్యమేనా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ రేట్లకు ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని సమాచారం అందుతోంది.

పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఓజీ నిలవడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓజీ ఫీవర్ తో ఊగిపోతున్నారు.  ఈ సినిమాకు పవన్ కెరీర్ లో గతంలో ఏ సినిమాకు జరగని స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా నైజాం హక్కులు ఏకంగా 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. నిర్మాత దిల్ రాజు ఈ హక్కులను కొనుగోలు చేయడం జరిగింది.

ఓజీ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ జరగకుండానే ఈ సినిమాపై అంచనాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్  సొంతం కాగా నెట్ ఫ్లిక్స్సినిమా రైట్స్ కోసం భారీమొత్తం ఖర్చు చేసిందని తెలుస్తోంది.  పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం అందుతోంది.  ఓజీ ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

ఈ నెల 21వ తేదీన విడుదలయ్యే ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఓజీ  సినిమా సక్సెస్ సాధిస్తే  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ కు కూడా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ  పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: