టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ కలిసి వార్ 2 అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది.

ఈ సినిమాను చాలా మంది ఓ టీ టీ లో చూడాలి అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఓ టీ టీ విడుదలకు సంబంధించి ఇప్పటివరకు ఏ అధికారిక ప్రకటన కూడా వెలువడ లేదు. ఈ మూవీ తో పాటే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ సినిమా కూడా ఆగస్టు 14 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటికే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. దానితో వార్ 2 సినిమా ఎప్పుడు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇస్తుందా ..? ఎప్పుడు చూద్దామా అని ఈ మూవీ ని ఓ టీ టీ లో చూడాలి అనుకునే వారు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా వార్ 2 మూవీ ఓ టి టి విడుదలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నెట్ ఫ్లిక్స్  ఓ టీ టీ సంస్థ వారు ఈ సినిమాను అక్టోబర్ 9 వ తేదీ నుండి తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: