
ఇప్పటికే సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు 160 కోట్ల మార్క్‌ను దాటేసి, 172 కోట్ల వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రైట్స్ సాధించింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమా. ఇంతకుముందు పవన్ చేసిన హరిహర వీరమల్ల 126 కోట్లు, బ్రో 97 కోట్లు, అజ్ఞాతవాసి 123 కోట్లు మాత్రమే ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించాయి. ఈ లెక్కలతో పోలిస్తే ఓ.జి దూసుకుపోయిందని చెప్పాలి. ఇక వసూళ్ల విషయానికి వస్తే — ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఓ.జి ఫస్ట్ డే వసూళ్లు 125 కోట్ల నుంచి 140 కోట్ల వరకు గ్రాస్ సాధించే అవకాశం ఉంది. మొత్తం రన్‌లో సినిమా 450 కోట్ల గ్రాస్ దాటితే బ్రేక్ ఈవెన్ సాధించినట్లే అవుతుంది. దసరా సెలవులు ల నేపథ్యంలో సినిమా రన్‌కి అదనపు బూస్ట్ లభిస్తుందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ప్రారంభమైన ప్రీ-బుకింగ్స్ చూస్తే, ఎక్కడ చూసినా ఓ.జి టికెట్లు సేల్ అవుట్ అవుతున్నాయి. ఫ్యాన్స్‌లో జోష్, ఉత్సాహం, క్రేజ్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఇప్పటివరకు పవన్ కెరీర్‌లో ఏ సినిమా కూడా 100 కోట్ల మార్క్‌ను దాటలేదని చెబుతుంటారు, కానీ ఓ.జి మాత్రం ఆ మైలురాయిని ఈజీగా దాటేసి కొత్త చరిత్ర రాసేలా కనిపిస్తోంది. సినిమాపై మొదటి నుంచి వచ్చిన టాక్ పాజిటివ్‌గానే ఉంది. ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇది ఖుషి లెవెల్‌లో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ని మరింత ఎత్తుకి తీసుకెళ్తుందని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.
సినిమా రిలీజ్ అవ్వడానికి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. మొదటి షో తర్వాత ఏ రేంజ్ టాక్ వస్తుందో? బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హంగామా సృష్టిస్తుందో? అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ – ఓ.జి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లోనే కాకుండా, మొత్తం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక కొత్త సెన్సేషన్ అవుతుంది.