
డైరెక్టర్ సుజిత్ 17 ఏళ్ల వయసులోనే షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీయర్ ను మొదలుపెట్టారు. సుజిత్ అనంతపురం ప్రాంతానికి చెందిన డైరెక్టర్. మొదటి సినిమా 2014లో రన్ రాజా రన్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుజిత్ తన అద్భుతమైన డైరెక్షన్ తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో సాహో సినిమాని తెరకెక్కించి మరింత క్రేజ్ అందుకున్న సుజీత్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన ఓజీ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. డైరెక్టర్ సుజీత్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. మొదట చార్టెడ్ అకౌంట్ కావాలనుకున్న సుజీత్ సినిమాల పైన మక్కువ ఉండడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
డైరెక్టర్ సుజీత్ వ్యక్తిగత విషయానికి వస్తే.. భార్య ప్రవల్లిక.. 2020లో వీరి వివాహం జరిగింది. వివాహానికి ముందు వీరిద్దరు కొన్నేళ్లపాటు ప్రేమలో ఉండి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. సుజీత్ భార్య ప్రవల్లిక వృత్తిపరంగా డాక్టర్. ఈమె ఆదాయం కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. ఓజి సినిమా రిలీజ్ నేపథ్యంలో సుజీత్ భార్య ప్రవల్లిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ జంటను చూసి నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. సుజీత్ భార్య కూడా స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సుజీత్ భార్యకు సంబంధించి ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.