- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మ‌ల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్ మరోసారి దర్శకుడిగా తన ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యాడు. ధ‌నుష్ రూపొందించిన తాజా సినిమా  “ ఇడ్లీ కడై ” తెలుగులో “ఇడ్లీ కొట్టు” అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. ధనుష్ స్వయంగా హీరోగా నటించడం, ఆయనకు జోడీగా నిత్యా మీనన్ హీరోయిన్‌గా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఇడ్లీ కొట్టు సినిమా అక్టోబర్ 1న విడుదల కానుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ధ‌నుష్ సినిమాలు అంటే తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ మంచి అంచ‌నాలే ఉంటాయి.


ఇప్పటికే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కుటుంబం, భావోద్వేగాలు, ఎమోషనల్ డ్రామాతో కూడిన ఈ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ట్రైలర్ చెప్ప‌క‌నే చెప్పేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. దీంతో ఇండ్లీ కొట్టు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని క్లారిటీ వ‌చ్చేసింది. ఈ సినిమా ర‌న్ టైం మొత్తం 2.27 గంట‌లు అంటే 147 నిమిషాలుగా ఖ‌రారైంది. ఈ నిడివి చూస్తుంటే సినిమాకు త‌గిన‌ట్టుగా ర‌న్ టైం క్రిస్పీగా క‌ట్ చేసిన‌ట్టుగా ఉంది.


ఈ సినిమాలో అరుణ్ విజయ్, శాలినీ పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారందరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మరింత బలాన్నిస్తుందని యూనిట్ నమ్ముతోంది.డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలింస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, బీజీఎమ్ మంచి స్పందనను రాబట్టాయి. అక్టోబర్ 1న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: