పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాను చూసేందుకు ఈసారి కేవలం పవన్ అభిమానులే కాకుండా, ఆయనను ఇష్టపడని వారు, పవన్‌ను విమర్శించే వారు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రేక్షకులు అందరూ థియేటర్లకు క్యూ కడుతున్నారు. కారణం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో కనిపించలేదు. ఇక భవిష్యత్తులో కూడా ఆయన ఇలాంటి పాత్ర చేయబోతారని అనుకోవడం కష్టమే. అందుకే ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.


సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు వరుసగా కనబడుతున్నాయి. దీన్నంతటికీ ప్రధాన కారణం దర్శకుడు సుజీత్. ఆయన పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో అచ్చం అలాంటి రూపంలో చూపించారు. అదే కారణంగా ఓజీని థియేటర్లో తప్పకుండా చూడాలనే ఉత్సాహంతో ప్రేక్షకులు క్యూలు కడుతున్నారు.అయితే మరో వైపు, ఓజీ సినిమాతో ప్రజలు నిజంగా ఏం నేర్చుకున్నారు? సమాజానికి దీని వల్ల ఏమైనా ఉపయోగమా? అనే కోణంలో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటిదే గతంలో పుష్ప 2 సినిమాకి జరిగింది. ఆ సినిమాలో బన్నీ (అల్లు అర్జున్) అక్రమ స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో నటించడంతో, “జనాలకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు? సుకుమార్ అసలు ఈ కథ ఎందుకు ఎంచుకున్నారు?” అంటూ ఘాటైన ట్రోల్స్ వచ్చాయి.



పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కూడా కొందరు “బన్నీ ఎందుకు ఇలాంటి పాత్ర చేసుకున్నాడు? ఇందులో పాజిటివ్ మెసేజ్ ఏముంది?” అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అలాంటి నెగిటివ్ రియాక్షన్లు పుష్ప 2 సినిమా విషయంలో ఎక్కువగా వినిపించినా, ఓజీకి మాత్రం అంత స్థాయిలో నెగిటివ్ వాతావరణం రాలేదు. దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. వారు తమ స్టార్ హీరోని ఇలాంటి రోల్‌లో చూడటం ఎంటర్టైన్‌మెంట్‌గా తీసుకున్నారు. కానీ ఇప్పుడే ఓజీ సినిమా బ్లాక్‌బస్టర్ అయిందని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ అభిమానులు సంతోషంగా రాస్తుంటే, మరోవైపు కొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. “ఓజి సినిమా చూసి జనాలు ఏం నేర్చుకున్నారు? కోపం వస్తే గన్ తీసి కాల్చేయాలా? ఇంతేనా మెసేజ్?” అంటూ విమర్శిస్తున్నారు.



ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అంతే ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు. “సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్‌మెంట్ కోసం. ఎంటర్టైన్‌మెంట్‌గా మాత్రమే చూడాలి. సమాజానికి పాఠం చెప్పడం కోసం కాకుండా, హీరోని కొత్త రూపంలో చూడడం మా కోసం ఆనందం. పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్రలో కనిపించడం మాకు ఒక సెలబ్రేషన్” అంటూ స్పష్టంగా చెబుతున్నారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఓజీ సినిమా చుట్టూ ఘాటు వాదనలు, కౌంటర్లు, ట్రోల్స్, రిప్లైలు కొనసాగుతున్నాయి. ఒకవైపు నెగిటివిటీని ప్రస్తావించే వారు ఉంటే, మరోవైపు ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా ఎంటర్టైన్‌మెంట్‌నే అని గట్టిగా చెబుతున్నారు. మొత్తానికి, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కేవలం బాక్స్ ఆఫీస్ హిట్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: