
ఒకప్పుడు “కమర్షియల్ హీరో పక్కన రుక్మిణి సెట్ అవుతుందా?” అన్న అనుమానాలు వచ్చిన క్రమంలో, ‘కాంతార చాప్టర్ 1’ తర్వాత ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఎన్టీఆర్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా పండుతుందని అభిమానులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, రుక్మిణి వసంతన్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ‘సప్తసాగరాలు దాటి’ సినిమా చూసి ‘డ్రాగన్’లో హీరోయిన్‌గా ఫిక్స్ చేశాడు. కానీ ఆ సినిమా అంతగా రాణించకపోవడంతో, కమర్షియల్ రేంజ్‌లో రుక్మిణి సరిపోతుందా అన్న సందేహాలు వినిపించాయి. అయితే ‘కాంతార చాప్టర్ 1’ భారీ విజయం వలన ఇప్పుడు రుక్మిణి కొత్త లెవెల్‌లో నిలబడింది.
ఈ సినిమాకి తాను ఎంత ప్రాధాన్యం ఇస్తుందో రుక్మిణి అప్పుడే గ్రహించింది. అందుకే ఫుల్ ఫోకస్ పెట్టి, ఎన్ని డేట్స్ కావాలన్నా ఇచ్చింది. కొన్ని మంచి ఆఫర్లను కూడా పక్కన పెట్టేసింది. ఇప్పుడు అవి అన్నీ తన కెరీర్‌లో పాజిటివ్‌గా మారాయి. ప్రస్తుతం యశ్ సరసన ఒక క్రేజీ సినిమాకి కమిట్ అయింది. ‘కాంతార’ ఎఫెక్ట్ వలన మరిన్ని బిగ్ ఆఫర్లు రుక్మిణి వైపు దూసుకువస్తున్నాయి. తెలుగులో అయితే యూత్ హీరోలతో రుక్మిణి మంచి ఆప్షన్‌గా కనబడుతోంది. ఎన్టీఆర్ – రుక్మిణి జోడీ ‘డ్రాగన్’లో ఎలా రాణిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిషబ్ శెట్టి ఇచ్చిన ఈ బూస్ట్‌తో రుక్మిణి టాలీవుడ్‌లో స్థిరపడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ‘కాంతార చాప్టర్ 1’ రుక్మిణి కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.