
ఆ సెన్సేషనల్ హిట్ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుందట! అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో “ఇడియట్ 2” అనే ప్రాజెక్ట్ గురించి వార్తలు హాట్ హాట్‌గా వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ ఇటీవల కొంతకాలంగా ఫామ్‌లో లేరు. “లైగర్”, సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే తన డైరెక్షన్‌కి మళ్లీ వైభవం తీసుకురావాలని, తన పాత ఇమేజ్ ని తిరిగి తెచ్చుకోవాలని ఆయన పట్టు పట్టారట. ఆ ప్రయత్నంలోనే “ఇడియట్ 2” అనే ఐడియా ముందుకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం, పూరి ఈ సీక్వెల్‌కి హీరోగా మరోసారి రవితేజను సంప్రదించారట.
రవితేజ కూడా కథ విని బాగా ఇంప్రెస్ అయ్యి, “ఇది మన ఇద్దరికీ మళ్లీ మాస్ రేంజ్ తీసుకువస్తుంది” అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ హీరోయిన్ ఎవరు..? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. మొదట పూరి కొంతమంది యాక్ట్రెస్‌లను పరిశీలించినా, చివరికి ఈ తరం అత్యంత క్రేజీ బ్యూటీ శ్రీలీల పేరునే ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. రవితేజ – శ్రీలీల జోడీ స్క్రీన్‌పై చూడటానికి ఫ్యాన్స్ కూడా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ జంట కాంబినేషన్‌లో వచ్చే ఎనర్జీ, యూత్ వైబ్రేషన్ సినిమాకు మరింత హైప్ తెస్తుందనే నమ్మకం టీమ్‌కి ఉందట.
ఇక ప్రొడక్షన్ వర్క్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే “ఇడియట్ 2”కు సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. ఆ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం సోషల్ మీడియా మొత్తం ఈ టాపిక్‌తో కదిలిపోవడం ఖాయం.మొత్తానికి పూరి జగన్నాథ్, రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో “ఇడియట్ 2” రాబోతుందనే వార్త టాలీవుడ్‌కి కొత్త జోష్‌ని తెచ్చిందని చెప్పాలి. ఒకప్పుడు థియేటర్లను షేక్ చేసిన చక్రి మ్యూజిక్ బీట్‌లు, రవితేజ డైలాగ్‌లు, పూరి మాస్ మేనరిజం మళ్లీ రిపీట్ అవుతాయేమో అని కుర్రాళ్లు ఇప్పటికే ఎగ్జైట్ అవుతున్నారు.