దీపికా పదుకొనే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్న పేరు. దీనికి ప్రధాన కారణం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న “స్పిరిట్” సినిమా అని చెప్పుకోవాలి. అప్పటివరకు అన్ని సవ్యంగా ముందుకు సాగుతుండగా, దీపికను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమెను ప్రాజెక్ట్‌ నుండి తప్పించారనే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “దీపిక హై రేంజ్కోరికలు తీర్చలేకపోవడంతో సినిమాకు దూరమయ్యింది” అంటూ రకరకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. అదే సమయంలో సినిమా టీమ్ మరో హీరోయిన్‌ని తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో, ఈ విషయం మరింత చర్చనీయాంశమైంది.


తర్వాత దీపికా స్థానంలో తృప్తి దిమ్రిను ఎంపిక చేశారు. అప్పటి నుండి దీపిక–తృప్తి–సందీప్ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దీపిక, తృప్తి ఇద్దరూ ముందుగా మంచి ఫ్రెండ్స్‌గా ఉండేవారన్న సమాచారం కూడా బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు వీరి మధ్య అపార్థాలు పెరిగాయంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దానికి తగ్గటే కల్కి 2 నుంచి కూడా హీరోయిన్ దీపిక పదుకునె ని తీసేయడం ఇంకా వైరల్ గా మారింది. ఇదే సమయంలో రీసెంట్‌గా తృప్తి దిమ్రి సైలెంట్‌గా  స్మార్ట్‌గా ముందుకువెళ్తుంది.



 దీపికా ఫ్యాన్స్  చేసిన ఓ పోస్టును ఆమె లైక్ చేసింది. ఆ పోస్టులో దీపికా “రామ్‌లీలా సినిమా కోసం 30 కిలోల బరువున్న లెహంగా వేసుకుని, కాళ్లకి గాయం అయినా డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది. ఆ కష్టాన్ని గుర్తు చేసుకుంటే గర్వంగా ఉంది” అని రాసుకొచ్చాడు. దీనికి తృప్తి లైక్ కొట్టడంతో — ఆమె దీపికకు సపోర్ట్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఇదంతా చూసిన సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ మాత్రం పీకల్లోతు కోపంగా ఉన్నాడని ఫిలిం నగర్ టాక్. “సందీప్ రెడ్డి వంగా కోపం వస్తే తృప్తినీ సినిమా నుంచి తీసేస్తాడు” అంటూ కొందరు వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం — “తృప్తి, నువ్వు చాలా మంచి మనసున్న అమ్మాయి. దీపిక క్వీన్” అంటూ ప్రశంసిస్తున్నారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ్వరు ఎన్ని మాట్లాడినా సినిమా నుంచి తీసేస్తున్న కొత్త వారిని పెట్టుకుంటున్న ప్రభాస్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: