
తర్వాత ఆమె పెళ్లి కూడా చేసుకుంది కానీ ఆ జీవితంలో కూడా సక్సెస్ సాధించలేకపోయింది. ఆ అనుభవం తర్వాత నిహారిక తన జీవితాన్ని కొత్తగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో ఆమె దృష్టి పూర్తిగా ప్రొడక్షన్ వైపు మళ్లింది. నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నీహారిక, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను స్థాపించింది. ఆ బ్యానర్‌లోనే ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా విడుదలైన కమిటీ కుర్రాళ్లు చిత్రం అనూహ్యంగా విజయం సాధించింది. కేవలం తొమ్మిది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, థియేట్రికల్ గా దాదాపు 24 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది. ఈ విజయంతో నిహారిక పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగింది. అనేక అవార్డులను అందుకుంటూ నిర్మాతగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంది.
ఇప్పుడు నిహారిక తన రెండో ప్రొడక్షన్ కోసం సిద్ధమవుతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో మానస శర్మ దర్శకత్వం వహించే ఈ కొత్త చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. కమిటీ కుర్రాళ్లు కాంబినేషన్‌లోనే డైరెక్టర్ యదు వంశితో మరోసారి జట్టు కట్టడానికి నిహారిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మూవీ 2026లో ప్రారంభమవుతుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విజయాల మధ్యలోనూ సోషల్ మీడియాలో నిహారికను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ ఆగడం లేదు. కొంతమంది నెటిజన్లు ఆమె వ్యక్తిగత జీవితంపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ స్టార్‌తో నిహారిక స్నేహపూర్వకంగా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో, “హద్దులు దాటిందంటూ”, “మళ్లీ పెళ్లి చేసుకోబోతోందంటూ” అనవసర రూమర్స్ పుట్టిస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
“నిహారిక ఇప్పటికే జీవితంలో చాలానే ఎదుర్కొంది. ఇప్పుడు ఆమె తన కెరీర్‌పై, తన ఫ్యూచర్‌పై ఫోకస్ చేస్తోంది. ఆమెను గౌరవించాలి, రూమర్స్ సృష్టించడం ఆపాలి” అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. కొంత మంది నీహారిక ఫ్యాన్స్ ఇలా ఆడపిల్ల పై నిందలు వేస్తే నాశనం అయిపోతారు రా రేయ్ అంటూ ఘాటు గా రియాక్ట్ అవుతున్నారు. నిహారిక ప్రస్తుతం తన బ్యానర్ ద్వారా కంటెంట్ ప్రొడక్షన్‌లో కూడా సరికొత్త దిశగా ముందుకు సాగుతోంది. వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ – ప్రతి విభాగంలోనూ కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులు సిద్ధం చేస్తోంది. తన ప్రతిభ, పట్టుదల, కష్టపడి పనిచేయాలనే తపనతో నిహారిక కొణిదల త్వరలోనే నిర్మాతల ప్రపంచంలో ఒక సూపర్ స్టార్‌గా ఎదగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు విశ్వసిస్తున్నాయి..!