
ఇప్పటికే చాలా భాగం సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూణేలో జరుగుతున్నట్లు తెలిసింది. ఈ కొత్త షెడ్యూల్లో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ పాల్గొంటోంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ పైన ఒక పాట చిత్రీకరిస్తున్నట్లు వినిపిస్తున్న ఈ పాటకు సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముఖ్యంగా ఈ వీడియోలో రామ్ చరణ్ ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో డాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది చాలా రిస్కీ సీన్ అన్నట్టుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే చుట్టూ లోతైన లోయ ప్రాంతాలు, ఎండిపోయిన చెట్టు మీద ఒక కాలు మరొక కాలు బండరాయి పైన ఉంచి మరి తన బాడీని బ్యాలెన్స్ చేస్తూ స్టెప్పులు వేశారు రామ్ చరణ్. ఈ వీడియో చూసిన అభిమానులు సినిమా కోసం రామ్ చరణ్ డేరింగ్ కు ఫిదా అవుతున్నామని కానీ సినిమా కోసం ప్రాణాలను లెక్క చేయకపోవడంపై అన్నా జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారింది.