300 కి పైగా సినిమాల్లో నటించిన రంగనాథ్ సంపాదించిన ఆస్తినంతా ఎడమ చేతికి తెలియకుండా కుడి చేత్తో దానం చేశారట. అలా చివరికి సంపాదించినవన్నీ పోయి రెంటెడ్ హౌస్ లో ఉండాల్సి వచ్చిందట. అదే సమయంలో పిల్లలు కూడా పట్టించుకోలేదని,చివరికి పట్టించుకునే దిక్కు లేక ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్న మాట వాస్తవమే కానీ పిల్లలు పట్టించుకోలేదు అనేది మాత్రం అవాస్తవం అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రంగనాథ్ కొడుకు నాగేంద్ర కుమార్ చెప్పుకొచ్చారు.ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మా నాన్న సంపాదించిన ఆస్తినంతా దానం చేశారు.అలాగే మా అమ్మ మంచాన పడ్డ సమయంలో చాలా డబ్బులు ఖర్చయ్యాయి. ఆ సమయంలో పనిమనిషి చాలా బాగా చూసుకుంది.అంతేకాకుండా అమ్మ చనిపోయాక నాన్న కుంగిపోయారు. 

మా ఫ్యామిలీతో కలిసి ఉండమని పిలిచినా కూడా ఉండలేదు.అందరం ఒకే దగ్గర ఉందామని చెప్పినా రాకుండా నేను సినిమాల్లో చేస్తున్నాను.నాకు ప్రైవసీ కావాలి అని చెప్పారు.అందుకే ఆయన ప్రైవసీకి అడ్డు చెప్పలేక ఒక్కడినే వదిలేసాం. ఆ తర్వాత పనిమనిషి మీనాక్షి నాన్నకు అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది. ఇక ఆయన చనిపోయిన సమయంలో గోడమీద రాసింది నిజమే. మీనాక్షి నాన్న బతికుండగానే ఓ ఇల్లు కట్టించమని అడిగిందట.అయితే ఆమె చేసిన పనులకి గానూ నాన్న నటుడు కాబట్టి డబ్బులు ఎక్కువగా వస్తాయి అని ఓ ఇల్లు కట్టించమని అడిగినట్టు నా వరకు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మీనాక్షిని మేము ఏమీ అనలేదు.

కానీ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయి. మీనాక్షి ని మేము కొట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ అదంతా అవాస్తవం. నేను మా అమ్మ నాన్న చేసిన సేవకి గానూ ఆమె కాళ్ళ మీద పడి మొక్కాను.నాన్న చేతి నుండి సహాయం పొందిన ఏ ఒక్కరు కూడా మాకు సాయం చేయలేదు. ఆ తర్వాత నా భార్య కూడా చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు ఎవరు రాలేదు.దాంతో బంధుత్వాలన్నీ తెంచేసుకున్నాను.నేను నా కొడుకు మాత్రమే ఉన్నాం. మేము ఎవరిని పట్టించుకోవడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రంగనాథ్ కొడుకు నాగేంద్ర కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: