మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం కీలక మలుపులో ఉంది. “గని”, “ గాంఢీవధారి అర్జున” ఆప‌రేష‌న్ వాలంటైన్ వంటి వరుస పరాజయాలు ఆయన ఇమేజ్‌పై కొంత ప్రభావం చూపాయి. యాక్షన్, రొమాంటిక్, ఎమోషనల్ జోనర్స్‌లో వెరైటీ చూపించడానికి ప్రయత్నించినా, బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో నిలవలేదు. దీంతో ఇప్పుడు వరుణ్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం వ‌రుణ్ ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రాజెక్ట్ “కొరియన్ కనకరాజు”. ఈ చిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ టైటిల్ వినగానేనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కొత్త అవతారంలో కనిపించబోతున్నారని సమాచారం.


సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తి కాగా, మిగిలిన పార్ట్ నవంబర్ చివరినాటికి ముగించాలనే ప్లాన్‌తో టీమ్ ముందుకు సాగుతోంది. ఇదిలా ఉండగా, వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను కూడా ఫైనల్ చేశాడు. ఈసారి ఆయన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్ట్ గతేడాదే చర్చల్లోకి వచ్చినా, షెడ్యూల్ సమస్యలు, స్క్రిప్ట్ మార్పుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అస‌లు వ‌రుణ్ తేజ్ వ‌రుస పెట్టి ప్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ర‌వితేజ‌తో డిజాస్ట‌ర్ సినిమా తీసిన సిరికొండ విక్ర‌మ్‌కు వ‌రుణ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో మెగా అభిమానులు సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. వ‌రుణ్ కెరీర్ ఏ తీరానికి చేరుతుందో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు.


డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుండ‌గా.. వచ్చే ఏడాది అమెరికాలో ఒక కీలక షెడ్యూల్ ప్లాన్ చేశారు. కథలోని ప్రధాన భాగం అమెరికా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. అక్కడే హీరో, హీరోయిన్ మధ్య జరిగే ప్రేమ కథతో పాటు, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో, అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఏదేమైనా కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా హిట్ అవ్వ‌క‌పోతే వ‌రుణ్ తేజ్ మార్కెట్  మ‌రింత డౌన్ అవ్వ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: