బీహార్ ఎన్నికల హడావుడి వేడెక్కుతున్న తరుణంలో చిరాగ్ పస్వాన్ తన పావులు చక్కగా కదుపుతున్నాడు.  కేంద్ర మంత్రి మరియు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పస్వాన్ ఎన్డీఏకి “ఐతిహాసిక విజయాన్ని” సాధించే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మహాగత్‌బంధన్‌ కూటమిలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. చిరాగ్ పస్వాన్ తాజాగా కేంద్ర హో,అ్ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బీహార్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన పర్యటనకు ఇది కీలక సమయం అని అంతా బావించారు. అదే సమయంలో చిరాగ్ పస్వాన్ కూడా ఆయనని కలవడం హాట్ టాపిక్ గా మారింది.

అమి షా తో మీటింగ్ అనంతరం పస్వాన్ మాట్లాడుతూ —“హోమ్ మంత్రి అమిత్ షా బీహార్ పర్యటనలో ఉన్నారు. ఇది మా కూటమి బలం. మేమంతా ఒకటిగా, భవిష్యత్తులో 'వికసిత్ భారత్' సాధన దిశగా ముందుకు సాగుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో బీహార్ అత్యంత ప్రాధాన్యత గల రాష్ట్రం,” అని చెప్పుకొచ్చారు.  పస్వాన్ మాట్లాడిన దాని ప్రకారం..“మోదీ గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత గత ఏడాదిలో 11 సార్లు బీహార్‌కి వచ్చారు. ఇది ఆయన బీహార్ పట్ల ఉన్న ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తుంది,” .అమిత్ షాతో జరిగిన సమావేశంలో,“ఐతిహాసికంగా ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహం గురించి విస్తృతంగా చర్చించాం,” అని పస్వాన్ వెల్లడించారు.

ఎన్డీఏ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. “ఎన్డీఏ తన ఐదుగురు మిత్రపక్షాలను గౌరవించింది. 243 స్థానాలపై అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మా అభ్యర్థులు స్పష్టంగా ప్రకటించబడ్డారు. ఎలాంటి గందరగోళం లేదు. కానీ మహాగత్‌బంధన్‌ లో మాత్రం అంతర్గత తగాదాలు కొనసాగుతున్నాయి,” అని వ్యాఖ్యానించారు.“మేము ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టాం, కానీ మహాగఠబంధన్ మాత్రం తమలో తాము ఎవరు బలవంతుడు అని తగువులాడుకుంటోంది,” అని వ్యంగ్యంగా అన్నారు.పస్వాన్ మహాగత్‌బంధన్‌ ను "గందరగోళంలో ఉన్న కూటమి"గా వర్ణించారు. “మహాగఠబంధన్‌లో అభ్యర్థులు తమ సొంత కూటమి అభ్యర్థులపైనే నామినేషన్లు వేస్తున్నారు. ఇది వారి అంతర్గత పోట్లాటల ప్రతిబింబం,” అని విమర్శించారు.

“ఆర్జేడీ మరియు కాంగ్రెస్ పాలనలో బీహార్‌లో చట్టం, సద్వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వారు బీహార్‌ను వెనక్కి నెట్టారు. ఇప్పుడు ప్రజలు మళ్లీ ఆ పరిస్థితికి వెళ్లాలనుకోవడం లేదు,” అని ఆయన విమర్శించారు.మొత్తంగా, చిరాగ్ పస్వాన్ ప్రకారం, ఎన్డీఏ బీహార్‌లో భారీ విజయానికి సిద్ధమవుతోంది, కాగా మహాగత్‌బంధన్‌ అంతర్గత విభేదాలతో బలహీనపడుతోంది అని ఘాటుగానే చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ బీహార్‌పై చూపుతున్న దృష్టి, కూటమిలోని ఐక్యత — ఇవే ఎన్డీఏ విజయానికి ప్రధాన బలం అని పస్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే కొందరు మాత్రం ఆయన అమిత్ షా మీటింగ్ ని కిండల్ చేస్తున్నారు. చిరాగ్ కి 29 సీట్లు ఇవ్వడం పట్ల ఎన్డీఏ కూటమిలో విబేధాలు భగ్గుమన్నాయి. కొందరు చిరాగ్ ఓవర్ చేస్తున్నాడు అని...మొదీ కి కంప్లైంట్ కూడా ఇచ్చారట. ఈ నెగిటివ్ ఇష్యూ ని సర్ధుమణీగేలా చేసుకోవడానికి అమిత్ షా ని ఇలా మీట్ అయ్యి బిస్కెట్ వేశాడు అంటున్న కొందరు నేతలు. ఏదైతేనేం చిరాగ్ కి చిరెత్తిపోతే ఏమైనా చేస్తాడు అని రీసెంట్ మీటింగ్ ద్వార బయటపడ్డింది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: