ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది — అదే అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి మీద జరుగుతున్న చర్చ. ఇప్పటివరకు స్నేహా రెడ్డి పేరు చుట్టూ ఒక్క నెగిటివ్ న్యూస్ కానీ, ట్రోలింగ్ కానీ వినిపించలేదు. ఎప్పుడూ తన సాఫ్ట్ నేచర్‌తో, ఫ్యాషన్ సెన్స్‌తో, స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన ఆమె గురించి మొదటిసారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం ఏమిటంటే — ఇటీవల జరిగిన దీపావళి వేడుకలు. అల్లు కుటుంబం అంతా కలిసి ఘనంగా దీపావళిని జరుపుకున్నారు. అల్లు అరవింద్, ఆయన కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్, వారి కోడళ్ళు, మనవళ్ళు — ఇలా మొత్తం కుటుంబం కలిసి ప్రత్యేక ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతూనే వైరల్ అయ్యాయి.

అయితే, అందులో ప్రత్యేకంగా ఆకట్టుకున్నది అల్లు శిరీష్ కాబోయే భార్య నైనికా  ప్రెజెన్స్. ఆమె ఫోటోలో కనిపించగానే నెటిజన్లు దృష్టంతా ఆమె మీద పడింది. “ఇదే శిరీష్ కాబోయే భార్యనా?”, “అద్భుతంగా ఉందే!” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, మీడియా పేజీలు పెద్ద ఎత్తున పోస్టులు చేయడం మొదలుపెట్టాయి.దీంతో స్నేహా రెడ్డి కాస్త అసౌకర్యంగా ఫీల్ అయిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, స్నేహా రెడ్డి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోల్లో నైనికా రెడ్డి కనిపించకపోవడం చాలా మందికి గమనించబడింది. ఫ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు — “అరే, ఈ ఫోటోలో నైనికా కనిపించట్లేదు కదా?” అని మాట్లాడుకుంటున్నారు.

 స్నేహా రెడ్డి షేర్ చేసిన ఫోటోల్లో నైనికా ఉన్న ఫ్రేమ్‌ని క్రాప్ చేసి కేవలం అల్లు శిరీష్ వరకే ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఒక్క క్రాప్‌డ్ ఫోటోతోనే సోషల్ మీడియాలో పెద్ద హడావుడి మొదలైంది.ఇప్పుడు నెటిజన్లు రెండు గ్రూప్ లుగా విడిపోయారు . కొంతమంది “ఇది పెద్ద కోడలి పెత్తనం”, “నైనికా క్రేజ్ పెరిగిపోతుంది అనిపించి స్నేహా ఆమె ఫోటోను తీసేసిందేమో” అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇది అంతా యాదృచ్ఛికం కావచ్చు, ఫ్రేమ్ సెట్ కుదరక ఫోటో కట్ అయి ఉండొచ్చు” అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

ఏదేమైనా, ఇంతవరకు ఎప్పుడూ ట్రోల్స్‌కు దూరంగా ఉన్న స్నేహా రెడ్డి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఆమెను సీరియస్‌గా ట్రోల్ చేస్తుంటే, మరికొందరు మాత్రం “స్నేహా ఎప్పుడూ ఇలాంటి చిన్న విషయాల గురించి పట్టించుకోదు” అని ఆమెకు మద్దతు ఇస్తున్నారు. అయితే అసలు నిజం ఏమిటి? స్నేహా రెడ్డి నిజంగా నైనికా ఫోటోను ఉద్దేశపూర్వకంగా కట్ చేసిందా? లేక అది కేవలం కోణం వల్లనో, ఫ్రేమ్ డిజైన్ వల్లనో జరిగిన అపార్థమా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీకి రాలేదు. కానీ ఈ చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో “అల్లు ఫ్యామిలీ లో కోడళ్ళ మధ్య గొడవలా?”, “తోడికోడళ్ళ మధ్య పోటీ మొదలైందా?” అంటూ వైరల్ అవుతోంది. ఇంతకీ స్నేహా రెడ్డి ఈ క్రాప్ ఇష్యూపై స్పందిస్తుందా? లేక మౌనం వహిస్తుందా? అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: