బిగ బాస్ సీజన్ 9 ఇప్పటికే 7 వారాలు పూర్తయ్యాయి. ఏడో వారం పచ్చళ్ల పాప రమ్య మోక్ష ఎలిమినేట్ అయినట్టు ఇప్పటికే వార్తలు లీక్ అయిపోయాయి. అయితే ఆదివారం రోజు ఆమె ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ ఇంకా స్ట్రీమింగ్ కాకముందే పచ్చళ్ల పాప ఎలిమినేట్ అయినట్టు ఇప్పటికే అందరికీ వార్తలు బయటికి వచ్చేసాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే..బిగ్ బాస్ 9 లో ఆ కంటెస్టెంట్ ని టార్గెట్ చేస్తే ఎలిమినేట్ పక్కా అంటూ సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. ఇక ఆ కంటెస్టెంట్ ఎవరంటే.. సీరియల్ బ్యూటీ తనూజ.. హౌస్ లోకి వచ్చినప్పటి నుండే తన ఆటతీరుతో అందరిని మెప్పిస్తున్న తనూజ టాస్కులు ఇస్తే చాలు ఆడ శివంగిలా టాస్కులు ఆడుతోంది. మగవారికి ధీటుగా తనూజ పర్ఫామెన్స్ ఇస్తూ బిగ్ బాస్ 9 లో గుడ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. 

అలా తనూజకి బయట చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఎవరు చూసినా సరే తనూజని పొగుడుతున్నారు. ఆమెకే ఓట్లు వేస్తున్నారు. అంతేకాదు బయట ఎవరైనా బిగ్ బాస్ ఎలా ఉంది అని నోటి దగ్గర మైక్ పెడితే చాలు తన గురించి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక టాక్ వినిపిస్తోంది. అదేంటంటే తనూజని ఎవరు టార్గెట్ చేసి మాట్లాడిన..ఎవరు ఆమెను నామినేట్ చేసినా సరే ఎలిమినేషన్ పక్కా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే తనూజని టార్గెట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారో వారందరూ ఒక్కొక్కరిగా బయటికి వచ్చేస్తున్నారు.

అలా ఈ వారం పచ్చళ్ల పాప రమ్య మోక్ష తనూజని చాలా టార్గెట్ చేసి మాట్లాడింది. అంతేకాదు వచ్చిన వారమే తనూజ గురించి లేనిపోని మాటలు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడడంతో పాటు ఈ వారం ఏకంగా నామినేషన్స్ లో ఆమెపై పొంతన లేని మాటలు మాట్లాడుతూ నామినేట్ చేసింది.ముఖ్యంగా పర్సనల్ అటాక్ చేయడంతో రమ్య మోక్ష పై నెగిటివిటీ ఏర్పడింది.తనూజ ఫ్యాన్స్ అందరు రమ్య మోక్ష బయటికి రావాలని కోరుకున్నారు. అలా తనూజ ఫ్యాన్స్ కోరుకున్నట్టే రమ్య ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: