ఇక నైజాంలో కూడా రూ. 12 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టిందని అలాంటప్పుడు ఈ సినిమా ఎలా ఫ్లాప్ అవుతుందంటు ఫైర్ అయ్యారు నాగ వంశీ. కింగ్డమ్ సినిమా తనకు ఎలాంటి నష్టాలు తీసుకురాలేదని నా నుంచి కొన్ని బయ్యర్లు కూడా అందరూ సేఫ్ లోనే ఉన్నారని ఒకరిద్దరూ నష్టాలు ఉంటే వారికి కూడా జీఎస్టీ రూపంలో రిటర్న్ ఇచ్చేసామంటు తెలియజేశారు నాగ వంశీ. అందరూ సేఫ్ జోన్ లో ఉన్నప్పుడు కింగ్డమ్ సినిమా ఎలా ఫ్లాప్ అవుతుందంటూ తెలియజేశారు. ఈ మూవీ అన్ని రకాలుగా మాకు మంచి హిట్ జోష్ కలిగించిందంటూ తెలియజేశారు నాగ వంశీ.
ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో సత్యదేవ్, వెంకటేష్, రాజకుమార్ కసిరెడ్డి తదితర నటీనటులు నటించారు. ఇక సినిమాలు రిలీజ్ తేదీని కూడా మేమే నిర్ణయించుకుంటాము , ఓటిటి సంస్థలు నిర్ణయించవంటూ తెలియజేశారు. సినిమా విడుదల తేదీలను ఓటీటి లే నిర్ణయిస్తారనేది కేవలం అపోహ మాత్రమే అంటూ తెలియజేశారు నాగ వంశీ. ప్రస్తుతం నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి