తాజా బజ్ ప్రకారం — స్నేహారెడ్డి ఒక స్టార్ హీరోయిన్‌కు కాల్ చేసి నేరుగా వార్నింగ్ ఇచ్చిందట! ఇది కొత్త విషయం కాదు, కానీ పాత ఘటన మరోసారి బయటకు వస్తోంది. అంతా మొదలైంది అల్లు అర్జున్ ఒక ప్రముఖ హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసిన సినిమా షూటింగ్ సమయంలోనే. అప్పట్లో ఆ హీరోయిన్ బన్నీతో పనిచేసేటప్పుడు కాస్త ఎక్కువగా ఇన్వాల్వ్ అయిందని, తరచూ షూటింగ్ కారణంగా అయినా సరే పదే పదే కాల్ చేస్తూ, మెసేజ్‌లు పంపుతూ ఉండేదట. మొదట్లో బన్నీ దాన్ని ప్రొఫెషనల్‌గా తీసుకున్నా, ఆ తర్వాత ఆ ఫోన్ కాల్స్ ఎక్కువై, బన్నీ-స్నేహారెడ్డి ప్రైవేట్ టైమ్‌కి డిస్టర్బెన్స్ కలిగించాయని టాలీవుడ్ టాక్. ఒకసారి, రెండుసార్లు గమనించిన స్నేహారెడ్డి చివరకు మాత్రం ఆ హీరోయిన్ పద్ధతి బాగోలేదని ఫీలై, డైరెక్ట్‌గా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిందట. "సినిమా షూట్ విషయమై మాట్లాడటం వేరే విషయం, కానీ ఎవరి వ్యక్తిగత సమయాన్ని డిస్టర్బ్ చేయడం తగదు" అంటూ కాస్త ఘాటుగా చెప్పిందని అప్పట్లో ఇండస్ట్రీ టాక్.
ఆ సమయంలో ఈ వార్త బాగా వైరల్ అయి, మీడియా కూడా పలు ఆర్టికల్స్ రాసింది. ఇప్పుడు, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అదే విషయం సోషల్ మీడియాలో బయటకు వస్తూ, “మళ్లీ స్నేహారెడ్డి కోపం వస్తే ఏం చేస్తుందో?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అల్లుఅర్జున్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలతో బిజీగా ఉండగా, స్నేహారెడ్డి మాత్రం ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది. కానీ, ఆమె ప్రైవేట్ లైఫ్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్ మరోసారి వైరల్ కావడం వల్ల, "స్టార్ వైఫ్ సైలెంట్‌గా కనిపించినా, అవసరమైతే ఘాటుగా రియాక్ట్ అవుతుంది" అన్న కామెంట్లు ట్రెండ్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి