దీపిక తర్వాత రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్, ఆలియా భట్, జాన్వి కపూర్ లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఇండస్ట్రీ టాక్ వినిపించింది. కానీ ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం, ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి రష్మిక మందన్నా డ్రాప్ అయిన్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో సౌత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించిన రుక్మిణి వసంత్‌ను తీసుకున్నారని సమాచారం. రుక్మిణి ఇటీవలి కాలంలో చేసిన సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా కాంతార ఛాప్టర్ 1 సినిమా హిట్ అవ్వడం ఆమెకి బిగ్ ప్లస్ అని చెప్పాలి. దీంతో ఆమెకి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. అట్లీ, అల్లు అర్జున్ ఇద్దరూ రుక్మిణి పేరుని ఫైనల్ చేసిన్నట్లు సమాచారం. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ వార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్గా మారింది.
రష్మిక ను అట్లీ-బన్ని ప్రాజెక్ట్ నుండి తీసేశారు అన్న వార్తలు ఒక్కసారిగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద హంగామా మొదలైంది. అయితే నిజానికి ఈ సినిమా నుండి ఆమెని తీసేయలేదు. ఆమె తప్పుకుందట. “ఇంత స్టార్ హీరోయిన్ ఎందుకు ఈ సినిమా నుండి తప్పుకుంది?” అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవడానికి కారణం ఆమె విజయ్ దేవర కొండని పెళ్లి చేసుకోబోతూ ఉండటమే అంటూ తెలుస్తుంది. ఫిబ్రవరీలో ఆమె పెళ్లి జరగబోతుందట ఆ కారణంగానే కమిట్ అయిన సినిమాలని ఫాస్ట్ గా షూట్స్ కంప్లీట్ చేసేయాలి అని.. అట్లీ కి ఇచ్చిన కాల్ షీట్స్ ని వేరే సినిమాకి కేటాయించిందట. సో అలా రష్మిక తప్పుకుంది రుక్మిణి ఈ ప్రాజెక్ట్ లో ఇన్ అయ్యింది..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి