మహేష్ బాబు.. కెరీర్‌లో ఎప్పటికి మర్చిపోలేని విధంగా నిలిచిన చిత్రం ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  సంచలన విజయాన్ని సాధించి.. ఇండస్ట్రీ హిట్‌గా రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు యాక్షన్, భూమిక చావ్లా నటన, ప్రకాశ్ రాజ్ విలన్ పాత్ర, సంగీతం, స్క్రీన్‌ప్లే – అన్నీ కలిసిన క్లాసిక్ మూవీగా ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే కళ్లు ఆర్పకుండా చూస్తారు. అంతలా ఈ సినిమా అంటే ఇష్టం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబును అల్లరిగా ఇబ్బంది పెట్టే చెల్లెలి పాత్రలో కనిపించిన చిన్నారిని గుర్తుందా? ఆ చిన్నారి పేరు "నిహారిక". అప్పట్లో తన అందంతో, అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ క్యూట్ గర్ల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.


నిహారిక కేవలం ఒక్కడులోనే కాకుండా, వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా, మోహన్ బాబు నటించిన యమజాతకుడు వంటి సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. బాల్య దశలోనే బిజీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, ఆ తర్వాత మాత్రం చదువులపై దృష్టి పెట్టి సినిమాలకు దూరమైంది. అసలు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉండటం లేదు. ఇటీవల నిహారిక పెళ్లి చేసుకుని, ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోందని సమాచారం. ప్రస్తుతం ఆమె సినిమాల్లో యాక్టివ్‌గా లేకపోయినా, సోషల్ మీడియాలో ఆమె పాత ఫోటోలు, ఇటీవల తీసిన కొన్ని స్టైలిష్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి ఆమెని గుర్తు చేసుకుంటున్నారు జనాలు.



ఆ ఫోటోలు చూసిన అభిమానులు –“ఇంత అందంగా మారిపోయిందా నిహారిక?” “హీరోయిన్‌లా ఉంది!” అంటున్నారు. మరికొందరి  “మళ్లీ సినిమాల్లో కనిపిస్తే బాగుంటుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు బాలనటిగా మనందరినీ ఆకట్టుకున్న నిహారిక, ఇప్పుడు గ్రేస్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా మారిపోయింది. ఒక్కడు సినిమా చూసిన వారందరికీ ఆమె గుర్తుండి పోయేలా చేసింది అన్నది మాత్రం నిజం. ఈ బ్యూటీ కనుక మళ్లీ సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ప్రసెంట్ ఆమెకి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: