టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. మొదట ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన ఆ తర్వాత ఈ మూవీ కలెక్షన్లు చాలా వరకు పడిపోయాయి. దానితో ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి అపజయాన్ని అందుకుంటుంది అని కొంత మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి మంచి కలెక్షన్లను వసూలు చేసి చాలా తక్కువ నష్టాలను మిగిల్చుకుంది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఎన్ని కోట్ల నష్టాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 30.70 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 4.57 కోట్లు , ఉత్తరాంధ్ర లో 3.78 కోట్లు , ఈస్ట్ లో 1.95 కోట్లు , వెస్ట్ లో 1.32 కోట్లు , గుంటూరు లో 1.95 కోట్లు , కృష్ణ లో 1.56 కోట్లు , నెల్లూరు లో 1.04 కోట్లు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు డబ్బింగ్ తో కలుపు కొని 4.25 కోట్లు , ఓవర్ సిస్ లో 9.90 కోట్ల కలెక్షన్లు ఈ మూవీ కి దక్కాయి. ఈ సినిమా దాదాపు 53.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 44.2 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ సినిమా దాదాపు 9.48 కోట్ల రేంజ్ లో నష్టాలను అందుకుంది. ఇలా ఈ మూవీ మామూలు రేంజ్ లో నష్టాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd