తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలలో హీరోగా నటించి అందులో అనేక మూవీలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. చైతన్య కొంత కాలం క్రితం తండెల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం చైతన్య "విరూపాక్ష" సినిమాకు దర్శకత్వం వహించి అద్భుతమైన విజయాన్ని అందుకొని దర్శకుడిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఇప్పటివరకు ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా యొక్క షూటింగ్ను "NC 24" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. తండెల్ సక్సెస్ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న మూవీ కావడం , విరూపాక్ష లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి ఓ ఏరియాలో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను 7 కోట్ల భారీ ధరకు ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నాగ చైతన్య కెరియర్ లో ఓవర్సీస్ అత్యధిక ధరకు అమ్ముడు పోయిన సినిమాలలో ఈ సినిమానే మొదటి స్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది. అలా ఈ సినిమాతో నాగ చైతన్య ఓవర్సీస్ లో సరికొత్త రికార్డును సృష్టించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc