మహేశ్ బాబు మేనకోడలు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు సిస్టర్ మంజుల ఘట్టమనేని కూతురు జాన్వీ శ్వరూప్ ఇప్పటికే సోషల్ మీడియాలో తన స్టైల్‌, గ్లామర్‌, అటిట్యూడ్‌తో బాగా పాపులర్ అయిపోయింది. సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి వస్తున్నందున, ఆమె ఎంట్రీపై సహజంగానే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, జాన్వీ శ్వరూప్ తన మొదటి సినిమాతోనే జాక్‌పాట్ కొట్టేసినట్టే కనిపిస్తోంది. మొదటి ప్రాజెక్ట్‌కే ఆమెకు పెద్ద బడ్జెట్‌, పెద్ద బ్యానర్‌, బిగ్ స్టార్ లతో కలిసి నటించే అవకాశం లభించిందట. ఈ సినిమా ఓ క్రేజీ యాక్షన్ -లవ్- రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుందని, ఇందులో జాన్వీ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా, అలాగే గ్లామరస్‌గా ఉండబోతోందని టాక్.


ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే — అసలు ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోవాలని మేకర్స్ మొదట ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కానీ కథ డిమాండ్‌ ప్రకారం ఫ్రెష్ ఫేస్ కావాలని, కొత్తదనం ఉండాలని దర్శకుడు మరియు ప్రొడ్యూసర్‌లు నిర్ణయించుకున్నారట. అలా వెతుకులాటలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండింగ్ అవుతున్న జాన్వీ శ్వరూప్ పేరుపై వాళ్ల దృష్టి పడింది. ఆమె లుక్స్‌, పర్సనాలిటీ, యాక్టింగ్ ట్రయల్స్ అన్నీ చూసి మేకర్స్ వెంటనే ఆమెను ఫైనల్ చేశారట.



ఇంత పెద్ద ఆఫర్ మొదటి సినిమాకే దక్కించుకోవడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. పైగా, జాన్వీ బ్యాక్‌గ్రౌండ్‌, ఆమెకు ఉన్న ఫ్యామిలీ సపోర్ట్, అలాగే మంజుల డైరెక్షన్‌, మహేశ్ బాబు గైడెన్స్—ఇవన్నీ జాన్వీ కెరీర్‌కు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతాయని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్స్ నెలకొన్నాయి. సినిమా షూటింగ్ జనవరి నెలలో ప్రారంభం కానుందని సమాచారం. సోషల్ మీడియాలో జాన్వీ ఫస్ట్ లుక్‌ రిలీజ్ అయితే, అది రికార్డ్ స్థాయిలో వైరల్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అందుకే చాలామంది ఇప్పుడే అంటున్నారు — "మొదటి సినిమాతోనే జాన్వీ శ్వరూప్ జాక్‌పాట్ కొట్టేసింది" అని..ఇండస్ట్రీలో కి కొత్త బ్యూటి వచ్చేసింది అని కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: