తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కేరిర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో శ్రీ లీల ఒకరు. ఈమె కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఈ సాంగ్ కి కూడా మంచి గుర్తింపు రావడంతో ఈ సాంగ్ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ లీల కి ఒక గోల్డెన్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ రెడ్డి  నిర్మాణంలో అరుంధతి అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అనుష్క తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో అనుష్క కు నటిగా ఎంతో గొప్ప గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను హిందీలో రీమిక్ చేసే ఆలోచనలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరు అయినటువంటి అల్లు అరవింద్ ఉన్నట్లు తెలుస్తోంది. అరుంధతి మూవీ రీమేక్ లో అనుష్క శెట్టి పాత్రలో శ్రీ లీల ను తీసుకోవాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా అదిరిపోయే రేంజ్ విజయం సాధించిన ఈ సినిమాని అల్లు అరవింద్ హిందీలో రీమిక్ చేయనున్నట్లు అందులో అనుష్క పాత్రలో శ్రీ లీల నటించనున్నట్లు మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు రావడంతో అనుష్క స్థాయి నటనను శ్రీ లీల చేయడం అంత ఈజీ విషయం కాదు అని , ఒక వేళ అనుష్క రేంజ్ నటనను శ్రీ లీల అరుంధతి రీమేక్ లో గనక ఇచ్చినట్లయితే ఆమె కెరియర్ కు ఇక తిరుగు ఉండదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: