కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో వాల్టేరు వీరయ్య అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. రవితేజమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఆయనకు భార్యగా క్యాథరిన్ నటించింది. ఈ సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. వాల్టేరు వీరయ్య లాంటి సూపర్ సక్సెస్ తర్వాత చిరంజీవి , బాబి కాంబో లో మరో మూవీ రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యం లో ఈ సినిమా చిరంజీవి కెరియర్లో 158 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ప్రస్తుతం బాబి "మెగా 158" మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అత్యంత బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి మాళవిక మోహనన్ ను హీరోయిన్గా తీసుకోవాలి అని ఈ మూవీ బృందం వారు భావిస్తున్నట్లు  , అందులో భాగంగా ఆమె తో సంప్రదింపులు కూడా జరిపినట్లు , ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మెగా 158 మూవీ లో మాళవిక మోహనన్ నటించబోతుంది అని వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని , ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: