నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో పొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ఇప్పటికే అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. దానితో అఖండ 2 మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అచనాలు ఉన్నాయి.

ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. దాదాపుగా బాలకృష్ణ ఈ మధ్య కాలంలో నటించిన చాలా సినిమాలకు తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. బాలయ్య సినిమాలకు తమన్ అద్భుతమైన సంగీతం అందిస్తూ ఉండడంతో అఖండ 2 మూవీ కి కూడా ఆయన అదిరిపోయి రేంజ్ మ్యూజిక్ ను ఇచ్చి ఉంటాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే అఖండ 2 మూవీ కి సంబంధించిన ఫస్ట్ సెమిగల్ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... అఖండ 2 మూవీ కి సంబంధించిన సాంగ్ సాంగ్ ను దాదాపుగా వచ్చే నెల 5 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలవడనున్నట్లు ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ ఫస్ట్ సింగిల్ గనుక అద్భుతంగా ఉన్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత తారా స్థాయికి చేరే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: