సినిమా ఇండస్ట్రీ లో ఓ మూవీ కి మంచి కలెక్షన్లు రావాలి అంటే ఆ సినిమాకు మంచి విడుదల తేదీ ముఖ్యం. ఓ మూవీ పెద్దగా పోటీ లేకుండా ఒక మంచి విడుదల తేదీలో విడుదల అయినట్లయితే ఆ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చినట్లయితే ఆ సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర రాబడుతూ ఉంటాయి. అదే ఒక సినిమా విడుదల అయిన సమయంలో వేరే సినిమాలు కూడా విడుదల అయ్యి ఆ మూవీలకు కూడా మంచి టాక్ వచ్చినట్లయితే సినిమాలు బాగున్నా కూడా పెద్ద మొత్తంలో కలెక్షన్లను వసూలు చేయలేవు.

ఇకపోతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీకి అత్యంత దగ్గరలో ది ప్యారడైజ్ , టాక్సిక్ , లవ్ అండ్ వార్ సినిమాల విడుదల తేదీలు కూడా అనౌన్స్ అయ్యాయి. దానితో పెద్ది సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండబోతుంది. సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా పోటీ వల్ల కలెక్షన్లు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడ్డారు.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది సినిమాకు అత్యంత దగ్గరగా విడుదల ఉన్న ది ప్యారడైజ్ , టాక్సిక్ , లవ్ అండ్ వార్ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని పెద్ది సినిమా ప్రపంచ వ్యాప్తంగా సోలోగా విడుదల అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే గనుక నిజం అయ్యి పెద్ది మూవీ కి మంచి టాక్ వస్తే ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: