కొన్ని చిత్రాలు అనుకోకుండా వచ్చి నటీనటులకు మంచి పేరు తెచ్చి పెడతాయి.. ఆ విధంగానే నాగార్జున కెరియర్లో అత్యద్భుతమైన చిత్రాల్లో  శివ చిత్రం ఒకటిగా చెప్పవచ్చు.. ఈ చిత్రానికి ముందు నాగార్జున సినీ లైఫ్ ఒక ఎత్తు ఉంటే ఈ చిత్రం తర్వాత మరో ఎత్తు అనే విధంగా తయారయ్యింది.. అలా నాగార్జునసినిమా ద్వారా ఇండస్ట్రీలో ఒక కొత్త దశ ప్రారంభించారని చెప్పవచ్చు.. రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ ప్రస్తుతం అత్యాధునిక 4k క్వాలిటీతో నవంబర్ 14న మరోసారి రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయట వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో రఘువరన్ దగ్గర పనిచేసే రౌడీ గణేష్ యొక్క పాత్ర కోసం మొదట నిర్మాత అక్కినేని వెంకట్ మోహన్ బాబు పేరుని సూచించారట. 

దీనిపై వెంటనే స్పందించినటువంటి రాంగోపాల్ వర్మ మోహన్ బాబు అయితే అస్సలు బాగుండదని కొట్టి పరేసారట. హీరోకు వార్నింగ్ ఇచ్చే సీన్ పవర్ ఫుల్ గా ఉండాలంటే ఆ సీన్ చూసి జనాలు భయపడాలి అంటే తెలియని యాక్టర్ అయితే బాగుంటుందని ఆలోచన చేశారట. మోహన్ బాబు ఇప్పటికే ఫ్యామిలీ మెన్ గా ప్రజల్లో మంచి ఆదరణ పొందారు.ఆయనను ఈ విధంగా విలన్ గా చేస్తే ప్రజలు రిసీవ్ చేసుకోలేరు. కేవలం మోహన్ బాబుని మాత్రమే చూస్తారు అంటూ చెప్పుకొచ్చారట.

ఈ పాత్రలో నిజమైన క్రూరత్వాన్ని ప్రేక్షకులు అనుభవించాలి అంటే విశ్వనాథ్ ను తీసుకోవాలని ఎంపిక చేశారట. దీంతో ఈ సినిమాలో మోహన్ బాబు మిస్ అయిపోయి విశ్వనాధ్ ఫైనల్ అయ్యారు. ఇంకేముంది సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అలా మోహన్ బాబు ని శివ సినిమాలో తీసుకుంటే డిజాస్టర్ అయ్యేదని, మోహన్ బాబుని తీసుకోకపోవడం వల్లే సినిమా హిట్ అయింది అంటూ రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: