తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించి మొదటి సినిమాతోనే సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన అర్జున్ రెడ్డి మూవీ ని హిందీ లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమిక్ చేశాడు. ఆ మూవీ హిందీ బాక్సా ఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ విజయం సాధించడంతో ఈయనకు హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినిమా కూడా మంచి విజయం సాధించడంతో దర్శకుడిగా ఈయన క్రేజ్ మరింత పెరిగింది. ఇకపోతే ఈయన తన తదుపరి మూవీ ని రెబెల్ స్టార్ ప్రభాస్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్ అనే టైటిల్ తో సినిమా చేయనున్నట్లు సందీప్ ప్రకటించాడు. ఇలా అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలో ఈయన నిర్మాతగా ఓ యువ హీరొతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... సందీప్ రెడ్డి వంగ , సుమంత్ ప్రభాస్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కెరియర్ను కొనసాగిస్తూ , ప్రభాస్ లాంటి హీరోతో సినిమా చేయడానికి రెడీగా ఉన్న సమయం లో సందీప్ రెడ్డి వంగ అనవసరంగా రిస్కు చేస్తున్నాడేమో ... సుమంత్ ప్రభాస్ తో చేసే సినిమా గనుక తేడా కొడితే సందీప్ కాస్త కష్టాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇక మరి కొంత మంది మాత్రం సందీప్ , సుమంత్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా ఆ సినిమా కథలో దమ్ము ఉండి ఉంటుంది. ఆ మూవీ తో కూడా సందీప్ కి మంచి విజయం దక్కుతుంది అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

srv