తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరో లలో సూపర్ స్టార్ రజినీ కాంత్ , లోక నాయకుడు కమల్ హాసన్ ముందు వరుసలో ఉంటారు. వీరు ఇద్దరు కూడా చాలా సంవత్సరాల క్రితం నటులుగా కెరియర్ను మొదలు పెట్టారు. ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికకి కూడా స్టార్ హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు. గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ ,  లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా ఓ మూవీ రూపొందబోయే అవకాశాలు ఉన్నాయి అని , ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించబోతున్నాడు ... ఈయన దర్శకత్వం వహించబోతున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలబడింది.

కానీ ఆ సినిమాలో వీరిద్దరూ హీరోలుగా కనిపించడం లేదు. రజనీ కాంత్ హీరో గా నటించబోయే సినిమాను కమల్ హాసన్ నిర్మించబోతున్నాడు. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. ఈ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడడం తోనే ఈ మూవీ పై అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.

ఈ సినిమాను 2027 వ సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 2026 వ సంవత్సరం పొంగల్ రాక ముందే 2027 వ సంవత్సరం పొంగల్ కానుకగా ఈ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకోవడంతో ఈ సినిమాకు ఏ మూవీ కూడా పోటీ రావద్దు అనే ఉద్దేశం తోనే మేకర్స్ పక్క ప్లానింగ్ తో ఈ మూవీ విడుదల తేదీ ని డిసైడ్ చేశారు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: