ఏంటి శివ మూవీ కోసం మొదట నాగార్జునని అనుకోలేదా..మొదట స్టార్ హీరోని అనుకున్నప్పటికీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ కథ నాగార్జునకు వచ్చిందా.. ఇంతకీ శివ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోలు తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కథ నచ్చకనో లేక డేట్స్ ఖాళీగా లేకనో సినిమాలను రిజెక్ట్ చేస్తారు. కానీ ఆ సమయంలో ఆ సినిమా విడుదలై హిట్ కొడితే మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నామని ఫీల్ అవుతారు.అయితే తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న శివ మూవీ కూడా మొదట వేరే హీరోని అనుకున్నారట.ఆ హీరో తండ్రి రిజెక్ట్ చేయడంతో అది కాస్త నాగార్జునకి వచ్చింది. 

ఇక శివ మూవీని మొదట రిజెక్ట్ చేసింది ఎవరంటే విక్టరీ వెంకటేష్. అయితే ఆర్జీవి మొదట ఈ సినిమా స్టోరీని రామానాయుడు దగ్గరే ప్రస్తావించారట. రామానాయుడు కి స్టోరీ చెప్పి వెంకటేష్ ని తీసుకుందామని అనుకున్నారట. కానీ రామానాయుడు కథ మొత్తం విని ఈ సినిమా వెంకటేష్ కైతే సెట్ అవ్వదు.ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ హీరోగా ఉన్నారు. ఇలాంటి సమయంలో కాలేజీ కుర్రాడిగా నటించి యాక్షన్ సినిమా చేస్తే ఆయన ఫ్యాన్స్ ఒప్పుకోరు కావచ్చు. ప్రస్తుతం ఆయన ఈ సినిమాని చేయకపోవడమే మంచిది..

నాగార్జున కైతే ఈ సినిమా  కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఆయన్ని తీసుకోండి అంటూ రామానాయుడు స్వయంగా చెప్పారట.దాంతో రాంగోపాల్ వర్మ వెంటనే నాగార్జున ఇంటికి వెళ్లి ఏఎన్నార్,వెంకట్, నాగార్జున ముగ్గురికి వెయ్యి అబద్దాలు చెప్పి ఈ సినిమాకి ఒప్పించారట. అలా కట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సినీ చరిత్రను మార్చిన సినిమాగా శివ మూవీని చెప్పుకున్నారు. అలాంటి ఈ మూవీ నవంబర్ 14న రీ రిలీజ్ అవ్వబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: